ఐపీఎల్ 2023 సీజన్‌లో చూసిన డ్రామా, ట్విస్టులు, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్.. ఇంతవరకూ ఏ సీజన్‌లోనూ చూడలేదు. అందుకే ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచులన్నీ స్క్రిప్టు ప్రకారం నడుస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి..
ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, 15 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో 213 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు అనేక అనుమానాలు రేపుతున్నాయి...
28
8 ఓవర్లలో 55 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ కింగ్స్. కుల్దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి లివింగ్‌స్టోన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని ఆన్రీచ్ నోకియా జారవిడిచాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని నోకియా జారవిడిచాడు..
38
అప్పటికి లియామ్ లివింగ్‌స్టోన్ స్కోరు 3 పరుగులే. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 10వ ఓవర్‌లో అథర్వ టైడ్ ఇచ్చిన క్యాచ్‌ని యష్ ధుల్ డ్రాప్ చేశాడు. అప్పటికి అథర్వ 36 పరుగులు చేయగా పంజాబ్ కింగ్స్ 69 పరుగులే చేయగలిగింది....
48
ఈ డ్రామా అక్కడితో ఆగలేదు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్, అథర్వ ఇద్దరూ రనౌట్ నుంచి తప్పుకున్నారు. 11వ ఓవర్ ఆఖరి బంతికి డైరెక్ట్ హిట్ మిస్ కావడంతో ఓవర్ త్రోలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించారు పంజాబ్ బ్యాటర్లు. రెండు సార్లు కూడా రనౌట్ మిస్ కాగా సింగిల్ కూడా రాలేదు..
58
Image credit: PTI
ఆ తర్వాతి ఓవర్‌లోనూ అథర్వకి మరో లైఫ్ దక్కింది. ఇషాంత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో లివింగ్‌స్టోన్ మొదటి బంతికి పూర్తిగా మిస్ అయ్యాడు. అప్పటికే 6 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉండడంతో పంజాబ్ కింగ్స్ ఓటమి ఖరారైపోయింది..
68
Image credit: PTI
అయితే రెండో బంతికి సిక్సర్, మూడో బంతికి ఫోర్ బాదిన లివింగ్‌స్టోన్, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. అది నో బాల్‌గా మారడంతో చివరి 3 బంతుల్లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. దీంతో పంజాబ్ కింగ్స్ మళ్లీ రేసులోకి వచ్చింది..
78
అయితే చివరి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదాల్సిన సమయంలో లివింగ్‌స్టోన్, ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. చెత్త ఫీల్డింగ్‌తో ఈజీగా ఆపే బంతులను కూడా బౌండరీకి పంపించారు ఢిల్లీ ఫీల్డర్లు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పంజాబ్ కింగ్స్‌కి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉండేవి.
88
(PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000387B)
ఆఖరి గ్రూప్ మ్యాచ్ వరకూ ఫ్లేఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ సాగేది. అందుకే పంజాబ్ కింగ్స్‌ని ఎలాగైనా గెలిపించాలని ఢిల్లీ క్యాపిటల్స్ బాగా ప్రయత్నించిందని, అయితే బ్యాటర్ల ఫెయిల్యూర్ కారణంగా పంజాబ్ ఓటమ తప్పలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..