అది షేన్ వార్న్ బాల్‌ ఆఫ్ ది సెంచరీతో సమానం... హర్‌ప్రీత్ బ్రార్‌పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...

Published : May 15, 2023, 11:14 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో 31 పరుగుల తేడాతో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టాపోయి 81 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులు ఎత్తేసింది...  

PREV
16
అది షేన్ వార్న్ బాల్‌ ఆఫ్ ది సెంచరీతో సమానం... హర్‌ప్రీత్ బ్రార్‌పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...

డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఈజీగా గెలిచేలా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్, వరుస వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని మూటకట్టుకుని, 2023 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది..

26

ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్... ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఫిలిప్ సాల్ట్‌, రిలే రసో, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేలను అవుట్ చేసిన హర్‌ప్రీత్ బ్రార్... పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు..

36

‘బ్రార్ బౌలింగ్‌ అద్భుతం. పవర్ ప్లేలో హర్‌ప్రీత్ వేసిన బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ బౌండరీలు బాదాడు. అయితే అతను ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు..

46

ముఖ్యంగా మనీశ్ పాండేని అవుట్ చేసిన బంతి, షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ది సెంచరీలా అనిపించింది. మెరుపులు మెరిపిస్తున్న డేవిడ్ వార్నర్‌ని కూడా మంచి బంతితో అవుట్ చేశాడు..

56

రిలే రసో మాత్రం బ్యాడ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. మొత్తానికి హర్‌ప్రీత్ బ్రార్ చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. పంజాబీ ప్లేయర్లు, పంజాబ్‌ టీమ్‌ని గెలిపించడం ఇదే మొదటిసారేమో...

66
Image credit: PTI

ప్రభుసిమ్రాన్, హర్‌ప్రీత్ బ్రార్ ఇద్దరూ కూడా పంజాబ్‌కి ఆడారు, పంజాబ్ కింగ్స్‌ని గెలిపించారు. మొదటి నాలుగు వికెట్లు పడగానే ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లోనుంచి మ్యాచ్ చేజారిందని అర్థమైంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!

Recommended Stories