కామెంటరీ చెబుతుంటే కాల్ చేశారు! దేనికో అనుకున్నా... కేదార్ జాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Published : May 04, 2023, 05:56 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే క్రికెట్ కెరీర్ ముగిసిపోయిందనుకున్న అజింకా రహానే, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా వంటి ప్లేయర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ఘనమైన కమ్‌బ్యాక్ చాటారు. ఇప్పుడు ఈ లిస్టులో చేరాలని తహతహలాడుతున్నాడు కేదార్ జాదవ్...

PREV
19
కామెంటరీ చెబుతుంటే కాల్ చేశారు! దేనికో అనుకున్నా... కేదార్ జాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2020 సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ అయిన కేదార్ జాదవ్‌ని, 2021 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అక్కడ కూడా జాదవ్ భాయ్ పొడిచిందేమీ లేదు. ఈ దెబ్బకు వరుసగా రెండు సీజన్లలో కేదార్ జాదవ్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు..

29

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి రిజిస్టర్ చేయించుకున్న కేదార్ జాదవ్, అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరాడు. దీంతో 2023 వేలంలో ధరను సగం తగ్గించి.. రూ.1 కోటి బేస్ ప్రైజ్ లిస్టులో రిజిస్టర్ చేయించుకున్నాడు. అయినా అతన్ని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు...

39

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక పోవడంతో అందరిలాగే తన మాజీ టీమ్ మేట్స్‌తో కలిసి కామెంటేటర్‌గా మారాడు కేదార్ జాదవ్. ఐపీఎల్ 2023 సీజన్‌లో మరాఠీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న కేదార్ జాదవ్‌ని సడెన్‌గా టీమ్‌లోకి తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

49

గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే ప్లేస్‌లో, కేదార్ జాదవ్, ఆర్‌సీబీ తరుపున ఆడబోతున్నాడు. టాపార్డర్‌లో కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్ తప్ప మరో బ్యాటర్ నుంచి ఇప్పటిదాకా పరుగులు రాలేదు..
 

59

షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్ వంటి కుర్రాళ్లను వన్‌డౌన్‌లో ఆడించినా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దినేశ్ కార్తీక్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు.రజత్ పటిదార్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరం కావడంతో ఆర్‌సీబీ బాగా దెబ్బ తీసింది.
 

69

కేదార్ జాదవ్ ఆ సమస్యని తీరుస్తాడని ఆశిస్తోంది ఆర్‌సీబీ. ‘నేను కామెంటరీ చెబుతుంటే సంజయ్ బంగర్ కాల్ చేసి, ఏం చేస్తున్నావని అడిగాడు. నేను కామెంటరీ చెబుతున్నా అని చెప్పాను. ప్రాక్టీస్ చేస్తున్నావా అని అడిగితే... అవును, వారానికి రెండు సార్లు చేస్తున్నానని చెప్పా...

79

జిమ్‌కి వెళ్తున్నావా, ఫిట‌్‌నెస్‌పైన ఫోకస్ పెట్టావా అని అడిగితే... నేను నా హోటల్ గదిలో వ్యాయామాలు చేస్తున్నా, ఫిట్‌గా ఉన్నా అని చెప్పాను. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఇవన్నీ ఎందుకు అడిగాడో నాకు అర్థం కాలేదు. కోచ్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారేమోనని భావించా...
 

89
Kedar Jadhav

ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసి, ఆర్‌సీబీ తరుపున ఆడతావా? అని అడిగాను. అది విని నేను సర్‌ప్రైజ్ అయ్యాను. అసలు అవకాశం వస్తుందని ఊహించని సమయంలో వచ్చిన ఛాన్స్ ఇది. టీమ్ నాపైన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి 110 శాతం కష్టపడతా...

99

నేను 20ల్లో ఉన్నప్పుడు పరుగులు చేయాలని ఎంత ఆరాటపడ్డానో అదే ఆరాటం ఇప్పుడు కూడా ఉంది. ఏడాది పాటు క్రికెట్‌కి దూరమైనప్పుడు జీవితంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అందుకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను.. ’ అంటూ కామెంట్ చేశాడు కేదార్ జాదవ్...

click me!

Recommended Stories