రాసిపెట్టుకోండి, ఈసారి ప్లేఆఫ్స్ వెళ్లేది ఆ నాలుగు టీమ్సే! వాటికి ఛాన్సే లేదు.. - హర్భజన్ సింగ్..

Published : May 04, 2023, 05:17 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫస్టాఫ్ థ్రిల్లింగ్ మ్యాచులతో నిండిపోగా, సెకండాఫ్‌ కాస్త డల్‌గా మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్,ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ తర్వాత జరిగిన రచ్చ కాస్త ఇంట్రెస్ట్ రేకెత్తించినా లో స్కోరింగ్ గేమ్స్, చికాకు తెప్పిస్తున్నాయి... అయితే మున్ముందు ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారనుంది.

PREV
19
రాసిపెట్టుకోండి, ఈసారి ప్లేఆఫ్స్ వెళ్లేది ఆ నాలుగు టీమ్సే! వాటికి ఛాన్సే లేదు.. - హర్భజన్ సింగ్..
Image credit: PTI

టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌‌లో ఓడిపోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం స్క్రిప్టు ప్రకారమే నడుస్తోందనే వార్తలకు ఊతం లభించింది... 47 మ్యాచులు ముగిసినా ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరే జట్లపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు...

29
Image credit: PTI

ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కూడా ఇంకా ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా ఉన్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ హర్భజన్ సింగ్, ప్లేఆఫ్స్  చేరే జట్ల గురించి కామెంట్లు చేశాడు..

39
PTI Photo/Ravi Choudhary)(PTI04_04_2023_000242B)

‘ఈసారి ప్లేఆఫ్స్ చేరే జట్ల గురించి అంచనా వేయడం కాస్త కష్టమైన విషయమే. అయితే గుజరాత్ టైటాన్స్ ఆడుతున్న విధానం చూస్తుంటే, డిఫెండింగ్ ఛాంపియన్ మళ్లీ ప్లేఆఫ్స్ చేరేలా కనిపిస్తోంది. వాళ్లు ప్లేఆఫ్స్ చేరేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు...

49

చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫామ్‌లో ఉంది, వరుసగా మ్యాచులు గెలుస్తోంది. ఆ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అదీకాకుండా ఈ సీజన్ ధోనీకి ఆఖరిది అని ప్రచారం జరుగుతోంది కాబట్టి వాళ్లు కచ్ఛితంగా టైటిల్ గెలవాలనే కసితో ఉన్నారు...
 

59

ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో 200లపైగా స్కోరును ఛేదించారు. వాళ్లు కూడా ఫుల్లు ఫామ్‌లోకి వచ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి వస్తే, ముంబైని ప్లేఆఫ్స్ చేరకుండా ఆపడం చాలా కష్టం అవుతుంది...
 

69

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా టాప్ 4లో ముగిస్తుందని అనిపిస్తుంది. ఆ టీమ్‌లో నలుగురే ఆడుతున్నా, జోష్ హజల్‌వుడ్ రాకతో ఆర్‌సీబీ కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
 

79
Image credit: PTI

రాజస్థాన్ రాయల్స్‌ కూడా రేసులో ఉంది. అయితే మిగిలిన టీమ్స్, దాన్ని ఓవర్‌టేక్ చేయొచ్చు. నా అభిప్రాయం ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌కి వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..

89

అయితే టేబుల్ టాప్ 2లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌‌ని హర్భజన్ సింగ్ పట్టించుకోలేదు. 10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కేతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 11 పాయింట్లతో టాప్ 2లో ఉంది...
 

99

10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో టాప్ 7లో ఉంది. ఆరో స్థానంలో ఉన్న ముంబై, ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరతాయని చెప్పిన హర్భజన్ సింగ్, నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మాత్రం చేరడం కష్టమని చెప్పడం విశేషం..

click me!

Recommended Stories