Image credit: PTI
టీమిండియా యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులోనూ గిల్ ముందున్నాడు. ఐపిఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ పట్టికలో ఫాఫ్ డు ప్లెసిస్‌ను అధిగమించడానికి గిల్‌కి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే అవసరం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్ లో డుప్లిసిస్ ని అధిగమించి ఆరెంజ్ క్యాప్ ఘనత సాధించే అవకాశం ఉంది.
గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినిపిస్తాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ కొద్ది రోజులకే సారా టెండుల్కర్ కాదు, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందట. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో ఈ జంట దుబాయి లో రొమాంటిక్ డిన్నర్ చేస్తూ మీడియా కంట పడ్డారు. అంతేకాకుండా విమానంలోనూ ఇద్దరూ కలిసి ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు బయటకు వచ్చింది.
చాలాసార్లు మీడియా ఈ విషయంపై వీరిద్దరినీ ప్రశ్నించగా, డేటింగ్ చేస్తున్నామనే ఇన్ డైరెక్ట్ గా చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారట. ఇద్దరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం అభిమానులను షాకింగ్ కి గురి చేసింది.
Cricketer Shubman Gill broke his silence about his relationship with Sara Ali Khan
వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా? ఎందుకు విడిపోయారంటూ అభిమానులు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో గిల్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Photo Courtesy: Instagram
అందులో గిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో యాంకర్.. బాలీవుడ్‌లో ఫిట్‌టెస్ట్ మహిళా నటి పేరు చెప్పమని అడిగారు. సారా అలీ ఖాన్ పేరును శుభ్‌మన్ తీసుకున్నారు మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ఏమో కావచ్చు (may be)అంటూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారడం విశేషం.
Arjun Tendulkar Sara Tendulkar Shubman Gill
నిజానికి, గిల్ మొదట సారా టెండుల్కర్ తో ప్రేమలో ఉన్నాడట. అయితే సారా అలీఖాన్ కోసం ఆమెను వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరికీ కూడా చెడింది. చూడాలి మరి తర్వాత వీరి జీవితాల్లోకి మరెవరు అయినా వస్తారా లేక వీళ్లే మళ్లీ కలుస్తారో..!