ట్రోఫీ పోయింది.. మైక్ మిగిలింది.. కొత్త అవతారంలో అలరించనున్న డుప్లెసిస్

First Published May 26, 2023, 10:15 AM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్ -16 లో లీగ్ దశలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  నిష్క్రమించడంతో ఆ జట్టు ఆటగాళ్లంతా తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి బ్యాగులు సర్దుకున్నారు. కానీ  కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం ఇక్కడే ఉండనున్నాడు. 

Image credit: PTI

ఆర్సీబీ కెప్టెన్  ఫాఫ్ డుప్లెసిస్ ఈ  సీజన్ లో వీరవిహారం చేసి  ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నా ఆ  జట్టు మాత్రం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత  సాధించకుండానే వెనుదిరిగింది.  చివరి లీగ్ మ్యాచ్ లో  ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ముంబై  ఇండియన్స్  ప్లేఆఫ్స్ ఆశలకు మార్గం సుగమం చేసింది.  

Image credit: PTI

అయితే   తమ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత  ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీ, సిరాజ్, హెజిల్వుడ్, పార్నెల్ వంటి ప్లేయర్లంతా బెంగళూరు నుంచి తమ స్వంత ప్రదేశాలకు తరలిపోయారు. కానీ ఆ జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం  ఇప్పటికీ ఇండియాలోనే ఆగిపోయాడు.  ఇన్నాళ్లు బ్యాటర్ గా అలరించిన డుప్లెసిస్.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు.  

Image credit: PTI

జియో దెబ్బకు   వ్యూస్ లేక అల్లాడుతున్న  స్టార్ స్పోర్ట్స్ వాటికోసం  నానా తంటాలు పడుతోంది.   ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు అయినా వ్యూయర్షిప్ ను పెంచుకునేందుకు గాను  డుప్లెసిస్ ను తమ ఎక్స్‌పర్ట్  ప్యానెల్  లో నియమించింది. అంటే  దీని ప్రకారం..  డుప్లెసిస్, నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ మధ్య జరుగబోయే   మ్యాచ్ తో పాటు ఐపీఎల్ - 16 ఫైనల్స్ కు కూడా మైక్ పట్టి  మ్యాచ్ ను విశ్లేషించనున్నాడు. 

తన ట్విటర్  ఖాతా వేదికగా  డుప్లెసిస్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘నేను మీకు ఓ ఎగ్జయింటింగ్ న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నా.  ఐపీఎల్ నుంచి  మేం తప్పుకోవడంతో ఆ సీజన్ ను నేను మిస్ అవుతన్నాననిపించింది.  కానీ నేను త్వరలోనే స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ లో జాయిన్ కాబోతున్నా. లాస్ట్ 2 మ్యాచెస్ కు  నేను అందుబాటులో  ఉంటా..’అని చెప్పాడు.

జియోలో ఉచితంగా  ప్రత్యక్ష ప్రసారాలు వస్తుండటంతో   స్టార్ స్పోర్ట్స్ లో  మ్యాచ్ లను చూసేవారి  సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో కొద్దిరోజుల నుంచి స్టార్.. వ్యూస్ ను పెంచుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఇటీవలే ముగ్గురు మహిళా యాంకర్లను  కూర్చోబెట్టి గిల్, కోహ్లీ, రసెల్ అర్థ నగ్న ఫోటోలను చూపిస్తూ ‘హాట్ ఆర్ నాట్’ చేసిన  కార్యక్రమం వివాదాస్పదమైంది. 

ఇదివరకే స్టార్.. తమిళ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్  పేసర్ నటరాజన్ తో తమిళ్ కామెంట్రీ చెప్పిస్తున్నది. తాజాగా  డుప్లెసిస్ కూడా  ఇందులో చేరాడు. మరి చివరి రెండు గేమ్స్ లో  ఆర్సీబీ కెప్టెన్ తన వాక్చాతుర్యంతో స్టార్ వ్యూస్ ను ఏ మేరకు పెంచుతాడో చూద్దాం....!

click me!