క్వాలిఫైయర్ గెలుస్తాం, ఈసారి కూడా ఫైనల్‌కి వెళ్తాం... - గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్...

First Published May 22, 2023, 4:30 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగింది. అయితే గ్రూప్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో ఎప్పుడో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకుంది గుజరాత్ టైటాన్స్... 
 

PTI PhotoShailendra Bhojak)(PTI05_21_2023_000436B)

ఐపీఎల్ 2022 సీజన్‌ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ టీమ్‌పై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం కాదు కదా, ఆఖరి పొజిషన్‌లో నిలవకపోతే చాలా పెద్ద విషయం అనుకున్నారు చాలామంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టైటిల్ గెలిచింది గుజరాత్ టైటాన్స్...
 

(PTI PhotoShailendra Bhojak)(PTI05_21_2023_000439B)

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 2022 టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్, 2023 సీజన్‌లో ఆ రేంజ్ పర్ఫామెన్స్ చూపించడం కష్టమేనని అన్నారు ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు. గత సీజన్‌లో ఏదో అదృష్టం కలిసి వచ్చి ఆ టీమ్ టైటిల్ గెలిచిందని అన్నారు..

Image credit: PTI

అయితే 2023 సీజన్‌లో కూడా అత్యద్భుత ఆటతీరుతో ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది గుజరాత్ టైటాన్స్. లీగ్ స్టేజీలో ఆర్‌సీబీతో మ్యాచ్‌కి ముందే 18 పాయింట్లతో ఉన్న గుజరాత్, చివరి మ్యాచ్‌లో ఓడినా దానిపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండేది కాదు..

Image credit: PTI

అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌కి ముందు రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్లకు రెస్ట్ ఇస్తారేమో అనుకున్నారంతా. అయితే టైటాన్స్ మాత్రం ఆఖరి లీగ్ మ్యాచ్‌ని కూడా ఛాలెంజ్‌గా తీసుకుని, పూర్తి బలగంతో బరిలో దిగింది...
 

Image credit: PTI

ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశలపై బీర్లు పోస్తూ, ఘన విజయంతో లీగ్ స్టేజీని ముగించింది. మంగళవారం, మే 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్. చెన్నైలో సీఎస్‌కేకి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండనుంది...

Image credit: PTI


‘చెన్నైలో చెన్నైతో క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా. మా బౌలింగ్ యూనిట్ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్ ఆడతామని అనుకుంటున్నా...

నేను మంచి ఫామ్‌లో ఉన్నా. మంచి ఆరంభం దక్కితే దాన్ని భారీ స్కోర్‌గా ఎలా మలచాలో నాకు బాగా తెలుసు...  ’ అంటూ కామెంట్ చేశాడు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్... 

Image credit: PTI

ఐపీఎల్ చరిత్రలో 12వ సారి ప్లేఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి టైటిల్ గెలవాలని కసిగా ఉంది. ఈసారి సీఎస్‌కే ఐపీఎల్ టైటిల్ గెలవడం, ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిపోతాయని చాలా మంది అంచనా వేస్తున్నారు.. 

click me!