మాట నిలబెట్టుకున్న దినేశ్ కార్తీక్.. రోహిత్ శర్మ సేఫ్.. ఇక నీకు మైకే గతి!

First Published May 22, 2023, 4:16 PM IST

IPL 2023: గతేడాది టీ20 వరల్డ్ కప్ టీమ్ లో రిషభ్ పంత్ ను సైతం పక్కనబెట్టి  తనను ఆడించినందుకు గాను  దినేశ్ కార్తీక్.. హిట్‌మ్యాన్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 

ఐపీఎల్ -16 లో  దినేశ్ కార్తీక్  పేలవ ప్రదర్శన  కొనసాగుతోంది.   గుజరాత్ టైటాన్స్ తో   నిన్న ముగిసిన  మ్యాచ్ లో  దినేశ్ కార్తీక్ మరోసారి డకౌట్ అయి  ఆర్సీబీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.  ఈ క్రమంలో కార్తీక్.. హిట్‌మ్యాన్  అత్యధిక డకౌట్ల రికార్డును  బ్రేక్ చేశాడు. 

బెంగళూరు - గుజరాత్ మ్యాచ్ లో  కార్తీక్.. బ్రాస్‌వెల్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చాడు. కానీ ఎదుర్కున్న తొలి బంతికే   వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.   యశ్ దయాల్ వేసిన  15వ ఓవర్ రెండో బాల్  కు ఔటయ్యాడు.  

కార్తీక్  డకౌట్ అవడం ద్వారా ఇదే సీజన్ లో కొద్దిరోజుల క్రితం   తన  పేరిటే ఉన్న రికార్డు (15 డకౌట్స్)ను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ (16 డకౌట్స్)  ను రాజస్తాన్ రాయల్స్  లోనే సమం చేశాడు కార్తీక్.  తాజగా  గుజరాత్ తో కూడా  డకౌట్ కావడంతో రోహిత్ రికార్డును బ్రేక్ చేసి 17 డకౌట్లతో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని  దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కార్తీక్, రోహిత్ తర్వాత  మన్దీప్ సింగ్, సునీల్ నరైన్ (15) లు  ఉన్నారు. 

ఈ సీజన్ లో   కార్తీక్ కు ఇది నాలుగో డకౌట్. ఇలా ఒక సీజన్ లో  4 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.  కార్తీక్ కంటే ముందు నికోలస్ పూరన్, ఇయాన్ మోర్గాన్, శిఖర్ ధావన్, మనీష్ పాండే,  మన్హస్, గిబ్స్ లు ఈ జాబితాలో ఉన్నారు. 

ఐపీఎల్ - 16 లో ఐదు సార్లు డకౌట్ అయి కొత్త  రికార్డు సృష్టించాడు బట్లర్.  హ్యాట్రిక్ డకౌట్స్ అయి   ఈ సీజన్ లో  చెత్త  ప్రదర్శనతో  తీవ్ర విమర్శలు ఎదుర్కున్న బట్లర్ రికార్డును   కార్తీక్.. ఆర్సీబీ మరో రెండు మూడు మ్యాచ్ లు ఆడి ఉంటే  బ్రేక్ చేసేవాడని ట్విటర్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

Image credit: PTI

గత ఐపీఎల్ సీజన్ లో   దినేశ్ కార్తీక్ ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే. ఆ సీజన్ లో  16 మ్యాచ్ లు ఆడిన   కార్తీక్..  10 ఇన్నింగ్స్ లలోనే 330 పరుగులు చేశాడు.   ఫినిషర్  రోల్ కు అసలైన న్యాయం చేసిన   కార్తీక్.. ఆర్సీబీ విజయాలలో కీలక పాత్ర  పోషించాడు. ఈ ప్రదర్శనలతో  బీసీసీఐ.. కార్తీక్ కు   గతేడాది ఆసియా కప్ తో పాటు  టీ20 ప్రపంచకప్ లలో ఆడించింది. 

రిషభ్ పంత్, సంజూ శాంసన్ లను  పక్కనెట్టి మరీ  కార్తీక్ తో ఆడించింది.  కానీ అతడు మాత్రం  స్థాయికి తగ్గ  ప్రదర్శనలు చేయక విఫలమయ్యాడు.    తాజాగా ఐపీఎల్ లో కూడా కార్తీక్ వైఫల్యాలు కొనసాగుతుండటంతో అతడు మళ్లీ కామెంటేటర్ డ్యూటీ ఎక్కాల్సిందేనని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.  భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వకముందు  కార్తీక్  కొన్నాళ్లు కామెంటేటర్ గా విధులు నిర్వర్తించాడు. 

click me!