అన్నా!నువ్వు లేకుండా ఎలా?... కృనాల్ పాండ్యాని టీమిండియాలోకి తెచ్చేందుకు హార్ధిక్ పాండ్యా స్కెచ్...

Published : Apr 23, 2023, 05:51 PM IST

అన్న లైఫ్‌లో సెటిల్ అయ్యి, తమ్ముడు కాకపోయినా పర్లేదు కానీ... తమ్ముడు టీమిండియా కెప్టెన్‌గా ఉండి, అన్నకి టీమ్‌లో చోటు కూడా లేకపోతే అస్సలు బాగోదు. అందుకే అన్న కృనాల్ పాండ్యాని టీమిండియాలోకి తెచ్చేందుకు హార్ధిక్ పాండ్యా పెద్ద స్కెచ్చే వస్తున్నాడని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

PREV
19
అన్నా!నువ్వు లేకుండా ఎలా?... కృనాల్ పాండ్యాని టీమిండియాలోకి తెచ్చేందుకు హార్ధిక్ పాండ్యా స్కెచ్...
PTI Photo/Atul Yadav)(PTI04_22_2023_000286B)

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడాడు హార్ధిక్ పాండ్యా. ఫామ్‌లో లేని హార్ధిక్ పాండ్యాని పొట్టి ప్రపంచ కప్ ఆడించడం వేస్ట్ అని సెలక్టర్లు భావించినా, టీమిండియా మెంటర్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ అతన్ని ఎంపిక చేయాల్సిందేనని పట్టుబట్టినట్టు వార్తలు వచ్చాయి...

29
sanju hardik

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన హార్ధిక్ పాండ్యా, 2022 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా కెప్టెన్సీపైన కానీ, గుజరాత్ టైటాన్స్ పైన కానీ ఎలాంటి అంచనాలు లేవు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొట్టమొదటి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ గెలిచింది టైటాన్స్...

39
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000403B)

దీంతో హార్ధిక్ పాండ్యా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఐపీఎల్ టైటిల్ గెలవడంతో కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లను పక్కనబెట్టి, హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ అప్పగించింది టీమిండియా. 

49
PTI Photo/Atul Yadav)(PTI04_22_2023_000247B)

వరుస విజయాలతో టీమిండియా ఫ్యూచర్ వైట్ బాల్ కెప్టెన్‌గా సెటిల్ అయిన హార్ధిక్, తన అన్న కృనాల్‌ని టీమ్‌లోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నాడని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

59

కృనాల్ పాండ్యా బౌలింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. పేరుకి స్పిన్నర్ అయినా బంతిని వేగంగా వికెట్లపైకి విసిరి కొడతాడు కృనాల్ పాండ్యా. అలాంటి కృనాల్ పాండ్యాతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయిస్తూ అదిరిపోయే రిజల్ట్ కూడా రాబడుతున్నాడు కెఎల్ రాహుల్... బ్యాటింగ్‌లోనూ టాపార్డర్‌లో వస్తున్నాడు...

69
Image credit: PTI

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బ్యాటింగ్‌కి రాగానే హార్ధిక్ పాండ్యా, అన్న దగ్గరికి వెళ్లి ఏదో చెప్పాడు. సెడ్జ్ చేసి ఏకాగ్రత దెబ్బతీస్తే కానీ అవుట్ కానంత గొప్ప ప్లేయర్ అయితే కృనాల్ కాదు, అది తమ్ముడికి కూడా బాగా తెలుసు....

79
PTI Photo/Vijay Verma) (PTI04_07_2023_000252B)

అదే ఓవర్‌లో టైటాన్స్ ఫీల్డర్లు, కృనాల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని నేల పాలు చేశారు... అది జారిపోయిందా? లేక జారవిడిచారా? అనేది అభిమానుల అనుమానం... 6 దగ్గర అవుట్ కావాల్సిన వాడు, 23 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు.

 

89

మరీ ఇంత దారుణంగా దొరికిపోయిన తర్వాత కూడా అవుట్ చేయకపోతే డౌట్స్ వస్తాయి. ఎలాగైతేనే బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో అదరగొడుతున్న కృనాల్, త్వరలో తమ్ముడి టీమ్‌లోకి... అదే టీమిండియాలోకి రావడం దాదాపు గ్యారెంటీగానే కనిపిస్తోంది..

99

అప్పుడెప్పుడో కృనాల్ పాండ్యా వన్డే ఆరంగ్రేటం చేసినప్పుడు గోల్డెన్ డకౌట్ అయ్యాడు హార్ధిక్ పాండ్యా. వచ్చిరాగానే అవుటై, అన్నకి బ్యాటింగ్ ఆడే అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో కృనాల్ హాఫ్ సెంచరీ చేశాడు. అలా ఇప్పుడు అన్న కోసం తమ్ముడు పావులు కదపడం లేదు కదా.. అని డౌట్స్ రావడం కూడా చాలా కామనే... 

click me!

Recommended Stories