ఫుల్ స్వింగ్‌లో పుజారా.. కౌంటీలలో సెంచరీల మోత..

Published : Apr 30, 2023, 01:11 PM IST

WTC Final 2023: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా   ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.   ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న  కౌంటీ ఛాంపియన్ డివిజన్ 2 - 2023 సీజన్ లో  రాణిస్తున్నాడు. 

PREV
16
ఫుల్ స్వింగ్‌లో పుజారా.. కౌంటీలలో  సెంచరీల మోత..

ఈ ఏడాది  జూన్ లో ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే  ఐసీసీ వలర్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముందు  టీమిండియాకు గుడ్ న్యూస్. ఇంగ్లాండ్ లోనే కౌంటీలు ఆడుతున్న  భారత జట్టు వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా  సెంచరీల మోత మోగిస్తున్నాడు.   

26

కౌంటీ ఛాంపియన్ డివిజన్ 2 - 2023  లో భాగంగా సస్సెక్స్ తరఫున ఆడుతున్న పుజారా ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. సస్సెక్స్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్న పుజారా.. డర్హమ్ తో మ్యాచ్ లో సెంచరీ చేయగా తాజాగా  గ్లోస్టర్‌షైర్ తో కూడా  శతకం బాదాడు. 

36

గ్లోస్టర్‌షైర్ తో మ్యాచ్ లో  191 బంతుల్లో సెంచరీ చేసిన పుజారా మొత్తంగా  238 బంతుల్లో  20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో   151 పరుగులు  సాధించాడు.   డర్హమ్ తో మ్యాచ్ లో పుజారా 115 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచ్ లలోనే పుజారా రెండో  శతకం సాధించడం విశేషం. గత కౌంటీ సీజన్ లో కూడా పుజారా వెయ్యికి పైగా పరుగులు చేశాడు. 

46

కాగా తాజా శతకంతో పుజారా మరో రికార్డును అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్  లో అతడికి ఇది 58వ సెంచరీ. తద్వారా ఈ జాబితా (భారత్ నుంచి) లో నాలుగో స్థానంలో ఉన్న వసీం జాఫర్ 57 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. 

56

ఈ జాబితాలో  సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్  లు 81 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు.  ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 68 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో విజయ్ హజారే నిలిచారు.

66

కాగా  పుజారా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే అది భారత జట్టుకు మేలు చేసేదే. ది ఓవల్ వేదికగా  జూన్ 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడనుంది.   వన్ డౌన్ లో వచ్చే పుజారా భారత జట్టులో చాలా కీలకం.  ఐపీఎల్ వల్ల భారత  ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్ లోనే ఆడుతున్నారు. వీరు   డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు ఏ విధంగా  ప్రిపేర్ అవుతారనేది  తెలియాల్సి ఉంది. కానీ పుజారా రాణిస్తుండటం మాత్రం భారత్ కు కలిసొచ్చేదే. 

click me!

Recommended Stories