ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గొడవ గురించి మూడు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. విరాట్ కోహ్లీతో నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్ వాగ్వాదానికి దిగిన సంఘటనపై క్రికెట్ ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు...
‘మ్యాచ్ అయిపోగానే నేను టీవీ ఆఫ్ చేశాను. ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో నాకు ఏం తెలీదు. ఆ తర్వాతి రోజు నిద్ర లేచాక ఫోన్ ఓపెన్ చేస్తే, అంతా రచ్చ రచ్చ జరుగుతోంది. ఏం జరిగిందో అది కరెక్ట్ కాదు...
26
Image credit: Getty
ఓడిపోయిన వాళ్లు సైలెంట్‌గా ఓటమిని ఒప్పుకోవాలి. గెలిచినవాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వాలి. చిన్న దానికి ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లను కొన్ని లక్షల మంది అభిమానిస్తారు. వాళ్లు క్రికెట్ ఐకాన్స్...
36
gambhir kohli
వాళ్లు చేసే ప్రతీ పనిని పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. నా ఫేవరెట్ క్రికెటర్ ఇలా చేశాడు, నేనెందుకు చేయకూడదని అనుకుంటారు. కాబట్టి మీరు క్రికెట్ క్రీజులో ఏం చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే బీసీసీఐ, గ్రౌండ్‌లో గొడవ పడే క్రికెటర్లను బ్యాన్ చేయాలి. అప్పుడే క్రికెట్ మైదానంలో గొడవ పడాలంటే క్రికెటర్లు భయపడతారు. మీరు ఏం చేయాలనుకున్నా, అది డ్రెస్సింగ్ రూమ్‌లోనే చేయాలి...
56
Kohli vs Gambhir
గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత జనాల ముందు డీసెంట్‌గా ఉండాలి. ఎందుకంటే నా కొడుకులు కూడా క్రికెటర్లు మాట్లాడే బూతులను ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. కెమెరాల్లో వినిపించకపోయినా, వారి లిప్ రీడింగ్ బట్టి ఏం మాట్లాడుతున్నారో చెబుతున్నారు..
66
ఇది కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి దిగ్గజాలు ఇలా మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే తప్పేంటి అనుకుంటారు. కాబట్టి సంస్కారంతో వ్యవహరించండి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..