సచిన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేయాలని ఉందన్న శుబ్‌మన్ గిల్... మామ అల్లుళ్ల కాంబో సెట్టు అంటూ!

Published : Apr 09, 2023, 04:32 PM IST

2023 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు శుబ్‌మన్ గిల్. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి అరుదైన జాబితాలో చేరిన శుబ్‌మన్ గిల్, టెస్టుల్లో, టీ20ల్లో కూడా సెంచరీలు అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి...  

PREV
18
సచిన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేయాలని ఉందన్న శుబ్‌మన్ గిల్... మామ అల్లుళ్ల కాంబో సెట్టు అంటూ!
Image credit: PTI

ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహాతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, టెస్టుల్లో రోహిత్ శర్మ, అప్పుడప్పుడూ కెఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, భవిష్యత్తులో రుతురాజ్ గైక్వాడ్‌తో ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

28

తాజాగా శుబ్‌మన్ గిల్‌ని ఎవరితో ఓపెనింగ్ చేయాలని ఉందనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు శుబ్‌మన్ గిల్. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ల్‌గా, 100 సెంచరీలు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్, రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలాడు...

38
Image credit: PTI

‘చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ని చూస్తూ పెరిగాను. ఆయనే నా రోల్ మోడల్, నా ఆరాధ్య దైవం. అవకాశం వస్తే సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలని ఉంది. అంత కంటే గొప్ప అదృష్టం ఇంకేం ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్..

48

గిల్ కామెంట్లపై సోషల్ మీడియా భిన్నంగా స్పందించింది. అవకాశం దొరికినప్పుడల్లా అల్లుడు శుబ్‌మన్ గిల్, మామగారిని ఎలా ఇంప్రెస్ చేయాలా? అని చూస్తున్నాడని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మామా అల్లుళ్లు బరిలో దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలేనంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..  
 

58

టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వకముందే శుబ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడని ప్రచారం జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. శుబ్‌మన్ గిల్ సెంచరీ చేసినా, డకౌట్ అయినా ఆఖరికి సోషల్ మీడియాలో ఒక్క ఫోటో పోస్ట్ చేసినా సారా టెండూల్కర్ ప్రస్తావన తీసుకొస్తారు నెటిజన్లు..
 

68

అలాగే సారా టెండూల్కర్ ఏ ఫోటో షేర్ చేసినా శుబ్‌మన్ గిల్ ఎక్కడ? ఉన్నాడంటూ కామెంట్లు చేస్తారు. లండన్‌లో ఒకే హోటల్‌లో సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి..

78

కొన్నాళ్ల క్రిందట హార్ట్ బ్రేక్ స్టేటస్‌లు పెట్టిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్‌తో కలిసి తిరుగుతూ కనిపించాడు. దీంతో సారా టెండూల్కర్‌ని వదిలేసి, సారా ఆలీ ఖాన్‌ని పట్టుకున్నాడని మీమ్స్ వైరల్ అయ్యాయి. ఓ టీవీ ప్రోగ్రామ్‌లో కూడా సారా అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించాడు శుబ్‌మన్ గిల్..

88

మొత్తానికి ఓ వైపు మాజీ క్రికెట్ లెజెండ్‌ కూతురుని, ఇంకో వైపు బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కూతురుని లైన్‌లో పెట్టిన శుబ్‌మన్ గిల్, ఎవరిని పెళ్లాడినా సారాకి మొగుడిగా మారతాడు. ఎవరి అండ లేకుండా టీమ్‌లోకి వచ్చినా, భారీ బ్యాక్‌గ్రౌండే సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు శుబ్‌మన్ గిల్.. 

Read more Photos on
click me!

Recommended Stories