చెన్నై సూపర్ కింగ్స్‌కి ‘డబుల్’ దెబ్బ... దీపక్ చాహార్‌కి తిరగబెట్టిన గాయం, బెన్ స్టోక్స్ కూడా...

First Published Apr 9, 2023, 2:54 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 12 పరుగుల తేడాతో నెట్టిన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చి  7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది..

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000364B)

వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించిన షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ బరిలో దిగని విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న మొయిన్ ఆలీ, తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు..

అయితే బెన్ స్టోక్స్ మరికొన్ని రోజుల పాటు టీమ్‌కి దూరంగా ఉండబోతున్నట్టు సమచారం. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్ స్టోక్స్ చేతికి గాయమైంది. ఎన్నో రోజులుగా ఈ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్..

Latest Videos


గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో సీఎస్‌కే ఆడబోయే తర్వాత రెండు మ్యాచుల్లో కూడా బెన్ స్టోక్స్ ఆడడం లేదు. బెన్ స్టోక్స్ ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు..

అలాగే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు దీపక్ చాహార్, తొడ కండరాలు పట్టుకోవడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఫిజియో చికిత్స తర్వాత బౌలింగ్ కొనసాగించాడు దీపక్ చాహార్. తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 2 నుంచి 6 వారాల వరకూ సమయం పడుతుంది..

దీపక్ చాహార్‌కి అయిన గాయం తీవ్రమైనదైతే అతను ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుంది. లేదంటే కనీసం ఒకటి రెండు వారాలు ఆటకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే 2022 సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహార్, ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి ఓవర్‌లో ఒకటి రెండు వికెట్లు తీస్తూ, పవర్ ప్లే ముగిసే సమయానికి తన బౌలింగ్ కోటాని ముగించుకునేవాడు దీపక్ చాహార్. అయితే ఈ సీజన్‌లో దీపక్ చాహార్ నుంచి అలాంటి పర్పామెన్స్ అయితే ఇప్పటివరకూ రాలేదు...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చిన దీపక్ చాహార్, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయితే 4 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించేశాడు. ఇందులో 5 వైడ్లు కూడా ఉన్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన దీపక్ చాహార్, 10 పరుగులు ఇచ్చాడు. గాయంతో ఆ తర్వాత బౌలింగ్ కొనసాగించలేదు చాహార్.. 

click me!