ఐపీఎల్ - 16లో వరుసగా సున్నాలు చుడుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుసగా సున్నాలు చుడుతూ ఐపీఎల్ లో 16 డకౌట్లు అయి చెత్త రికార్డు నమోదు చేసుకున్న హిట్‌మ్యాన్ పై శ్రీకాంత్ (చిక్కా) పై విమర్శలు గుప్పించాడు.
27
ముంబై - చెన్నై మధ్య శనివారం వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో రోహిత్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ కాదు. నో హిట్ శర్మ..’అని అన్నాడు. అంతేగాక అతడిని తన జట్టులో అయితే తీసుకోనని కామెంట్ చేశాడు.
37
‘రోహిత్ ను అందరూ హిట్ మ్యాన్ అంటారు. కానీ నా దృష్టిలో అతడు నో హిట్ శర్మ. నేనే గనక ముంబై సారథిని అయితే అతడిని ప్లేయింగ్ లెవన్ లో తీసుకోనే తీసుకోను..’అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కామెంట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ కూడా శ్రీకాంత్ కు ధీటుగానే బదులిస్తున్నారు.
47
ఆటగాళ్ల కెరీర్ లో ఒడిదొడుకులు సర్వసాధారణమేనని, శ్రీకాంత్ తన కెరీర్ మొత్తం వంద శాతం సగటుతో రాణించాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీజన్ లో విఫలమైనంత మాత్రానా ఐపీఎల్ లో ఆరు వేల పరుగులు చేసిన ఆటగాడిని ఇలా అవమానించడం తగదని కామెంట్స్ చేస్తున్నారు.
57
కాగా ఈ సీజన్ లో పంజాబ్ తో మ్యాచ్ లో డకౌట్ అయిన రోహిత్.. చెన్నైతో మ్యాచ్ లో కూడా సున్నా చుట్టాడు. తద్వారా ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నైతో మ్యాచ్ లో డకౌట్ అవడం రోహిత్ కు 16వ సారి. అంతేగాక ఈ సీజన్ లో పది మ్యాచ్ లలో 184 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే ఉంది.
67
గతంలో ఈ రికార్డు దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ లు 15 సార్లు డకౌట్ అయిన వారిగా ఉన్నారు. ఈ రికార్డును పంజాబ్ తో మ్యాచ్ లో సమం చేసిన రోహిత్.. చెన్నైతో మ్యాచ్ లో అధిగమించాడు.
77
కాగా రోహిత్ తో పాటు ముంబై బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. నెహల్ వధేరా.. 61 పరుగులతో టాప్ స్కోరర్. లక్ష్యాన్ని చెన్నై.. 17.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (44), రుతురాజ్ గైక్వాడ్ (30) రాణించారు.