ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తాకింది. జనవరి, ఫిబ్రవరి మొదటివారం వరకూ ఐపీఎల్ లో రీఎంట్రీ ఇస్తాడని ఆశించిన బుమ్రా.. ఉన్నఫళంగా కొంతకాలంగా వేధిస్తున్న వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు ఐపీఎల్ - 16 నుంచి తప్పుకున్నాడు. ఇది జరగడానికి కొద్దిరోజుల ముందే ముంబై మరో పేసర్, ఆసీస్ ఆటగాడు జై రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు.