ఆ ఓవర్ ఇంకా మరిచిపోలేకపోతున్నా! నిద్ర కూడా పట్టట్లే... మోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్...

Published : Jun 01, 2023, 01:24 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన సీనియర్లలో మోహిత్ శర్మ ఒకడు. మొదటి మూడు మ్యాచుల తర్వాత జట్టులోకి వచ్చిన మోహిత్ శర్మ, 14 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఫైనల్ ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేశాడు...  

PREV
18
ఆ ఓవర్ ఇంకా మరిచిపోలేకపోతున్నా! నిద్ర కూడా పట్టట్లే... మోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్...

మోహిత్ శర్మను 11వ ఓవర్ దాకా అట్టి పెట్టిన హార్ధిక్ పాండ్యా, అతనితో 11, 13, 15వ ఓవర్లలను వేయించాడు. 11వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చిన మోహిత్ శర్మ, అజింకా రహానే వికెట్ తీసి గుజరాత్ టైటాన్స్‌ని మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాడు...
 

28
Mohit Sharma-hardik Pandya

13వ ఓవర్‌లో 6,4,6 బాదిన అంబటి రాయుడిని అవుట్ చేసిన మోహిత్ శర్మ, ఆ తర్వాతి బంతికే మహేంద్ర సింగ్ ధోనీని డకౌట్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 13 పరుగులే కావాల్సి రాగా మొదటి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాడు మోహిత్ శర్మ..

38

అయితే ఆఖరి 2 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ బాదిన రవీంద్ర జడేజా... మ్యాచ్‌ని ముగించేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, ఐదో టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది...

48

‘ఆఖరి ఓవర్‌లో ఎలా బౌలింగ్ చేయాలి, ఏ బంతులు వేయాలనే విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నెట్స్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో చాలా ప్రాక్టీస్ చేశాను. హార్ధిక్ పాండ్యాకి కూడా అదే చెప్పాను...

58

చివరి ఓవర్‌లో అన్నీ యార్కర్లే వేస్తానని హార్ధిక్ పాండ్యాను చెప్పాను. మ్యాచ్ అయిపోయిన తర్వాత జనాలు చాలా చెబుతారు, అయితే ఇప్పుడు అవన్నీ వ్యర్థ వాదనలే. ఆ పరిస్థితిలో ఏం చేయగలనో నేను అదే చేశాను...

68
Image credit: PTI

ఫైనల్ మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నా నాకు నిద్ర పట్టట్లేదు. ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నా. ఆ రెండు బంతుల్లో అలా వేసి ఉంటే ఏమయ్యేది? ఈ బాల్ వేసి ఉంటే ఏమయ్యేది అని అక్కడే తిరుగుతున్నా...
 

78
Dhoni and Mohit

ఫైనల్ మ్యాచ్‌ని సరిగ్గా ముగించలేకపోయాననే ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ నన్ను వేధిస్తోంది. దాన్ని మరిచిపోయి, ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నా.. 

88
Mohit Sharma

గత సీజన్‌లో నేను నెట్ బౌలర్‌గా ఉన్నా, ఈ సారి టీమ్‌లోకి వచ్చా. సీజన్ ఆరంభంలోనే ఈసారి మరింత కష్టపడాలని అనుకున్నా. పనిపట్ల నా అంకిత భావం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సీజన్ బాగా నడిచింది. ఆ రెండు బాల్స్ సరిగా పడి ఉంటే ఇంకా బాగుండేది...’ అంటూ కామెంట్ చేశాడు మోహిత్ శర్మ..
 

click me!

Recommended Stories