ఐపీఎల్ 2023 సీజన్‌లో చాలామంది సీనియర్లు ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చారు. అయితే వీరిలో అజింకా రహానే ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడతాడనే అపవాదు మోసిన రహానే, 200+ స్ట్రైయిక్ రేటుతో దుమ్మురేపాడు...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తరుపున ఆరంగ్రేటం చేసిన అజింకా రహానే, 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో అప్పటిదాకా వచ్చిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే...
27
ఆ తర్వాత వరుసగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, 6 మ్యాచుల్లో 200+ స్ట్రైయిక్ రేటుతో 224 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
37
PTI Photo) (PTI04_27_2023_000372B)
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ 13 బంతులు ఆడి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు అజింకా రహానే. 171 పరుగుల లక్ష్యఛేదనలో రహానే ఆడిన ఈ ఇన్నింగ్స్ ఎంతో విలువైనది...
47
Image credit: PTI
‘వాస్తవానికి మేం అజింకా రహానేని ఆడించాలని అనుకోలేదు. మా ప్లాన్స్‌లో అతను లేడు. ఇంతకుముందు ఛతేశ్వర్ పూజారాని కొన్నట్టే, ఈసారి రహానేని ట్రై చేయాలని అనుకున్నాం. అతని అనుభవం టీమ్‌లోని కుర్రాళ్లకు ఉపయోగపడుతుందని కొన్నాం...
57
Image credit: PTI
అయితే టోర్నీ మధ్యలో మొయిన్ ఆలీ గాయపడడంతో అజింకా రహానేని ఆడించాం. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అతని ఆటను చూశాకే, అతను మాకు విజయాలు అందించగలడని అర్థమైంది..
67
Ajinkya Rahane
అందుకే వన్‌డౌన్‌లో అతన్ని ఫిక్స్ చేశాం. ప్రాక్టీస్ సెషన్స్‌లో రహానే అద్భుతమైన ఫామ్‌లో ఉండడాన్ని గమనించాను. అందుకే మొయిన్ ఆలీ ప్లేస్‌లో ఆడించాం. అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేదు...
77
Ajinkya Rahane
అజింకా రహానే ఆడిన విధానం, ఫీల్డింగ్‌లో అతను చూపించిన స్కిల్స్... నెట్స్‌లో, టీమ్‌లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాయి. అతను భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా అతని ప్లేస్‌కి భరోసా ఇచ్చాం. అదే రహానే ఈ లెవెల్‌లో రాణించడానికి కారణమైంది...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్..