వీళ్లూ ఐపీఎల్ సారథులేనన్న సంగతి తెలుసా..? జాబితాలో ఎవరూ ఊహించని పేరు..

Published : Mar 29, 2023, 05:39 PM IST

IPL 2023: భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ముగ్గురు క్రికెటర్లు మురళీ విజయ్,  కరుణ్ నాయర్, మనీష్ పాండేలు కూడా ఐపీఎల్ లో సారథులుగా ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు. 

PREV
17
వీళ్లూ ఐపీఎల్ సారథులేనన్న సంగతి  తెలుసా..? జాబితాలో ఎవరూ ఊహించని పేరు..

ఐపీఎల్‌-16 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.  ఈనెల 31 నుంచి మొదలుకాబోయే ఈ మెగా సీజన్ కోసం అన్ని జట్లూ  సిద్ధమవుతున్నాయి.  రెండ్రోజుల క్రితం  కోల్కతా నైట్ రైడర్స్ తమ రెగ్యులర్ సారథి  శ్రేయాస్ అయ్యర్ స్థానంలో  నితీశ్ రాణాను తాత్కాలిక కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే  ఐపీఎల్ లో జట్లకు సారథులు మారడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా జరిగిందే.  

27

కానీ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ముగ్గురు క్రికెటర్లు మురళీ విజయ్,  కరుణ్ నాయర్, మనీష్ పాండేలు కూడా ఐపీఎల్ లో సారథులుగా ఉన్నారన్న విషయం ఎంతమందికి తెలుసు.  అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం. 

37

మురళీ విజయ్ :   ఐపీఎల్  లో మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ  మాజీ క్రికెటర్  పంజాబ్ కింగ్స్ కు  సారథిగా ఉన్నాడు.   2016 సీజన్ లో మురళీ.. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈ సీజన్ లో పంజాబ్.. తమ సారథిగా   డేవిడ్ మిల్లర్ ను ప్రకటించింది.  

47

కానీ మిల్లర్ సారథ్యంలో ఆరు మ్యాచ్ లు ఆడిన తర్వాత   పంజాబ్  ఐదింటిలో ఓడింది. దీంతో పంజాబ్ టీమ్ మేనేజ్మెంట్.. మిల్లర్  ను కాదని మిగిలిన సీజన్ కు మురళీని సారథిగా నియమించింది. అయితే ఈ తమిళ తంబీ కూడా పంజాబ్ రాతను మార్చలేదు.  ఆ  సీజన్ లో  పంజాబ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 

57

కరుణ్ నాయర్ :  ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించేది.  కానీ నిజం. 2017  సీజన్ లో ఢిల్లీ తమ రెగ్యులర్ కెప్టెన్ జహీర్ ఖాన్ కు గాయం కావడంతో  కరుణ్ నాయర్ ను తాత్కాలిక సారథిగా నియమించింది.  అంతకుముందు  కరుణ్..   ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున  ఆరు మ్యాచ్ లలో  17 పరుగులే చేసినా  మేనేజ్మెంట్ కు మరో ఆప్షన్ లేక   కరుణ్ నాయర్ వైపునకే మొగ్గుచూపింది.  మూడు మ్యాచ్ లలో ఢిల్లీకి సారథిగా పనిచేసిన నాయర్.. రెండింట్లోనూ విజయాలు అందించడం గమనార్హం.   కరుణ్ నాయర్.. భారత్ తరఫున    2016లో  ఇంగ్లాండ్ తో టెస్టు ఆడుతూ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) చేసిన విషయం తెలిసిందే. 

67

మనీష్ పాండే :  2009  ఐపీఎల్ సీజన్ లో  సెంచరీ చేసిన ఈ కర్నాటక బ్యాటర్ గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.  ఐపీఎల్ లో మొట్ట మొదటి సెంచరీ  చేసిన బ్యాటర్ పాండేనే కావడంతో   ఇతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని  వాదనలు వినిపించాయి.   కానీ  తర్వాత  అలా జరుగలేదు. అయితే  పాండే కూడా  ఐపీఎల్ లో సారథిగా పనిచేశాడు.  

77

2021 ఐపీఎల్ లో   పాండే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు   కెప్టెన్ గా పనిచేశాడు. డేవిడ్ వార్నర్ ను పక్కనబెట్టిన   ఎస్ఆర్హెచ్..   కేన్ మామకు  సారథ్య పగ్గాలు అప్పగించింది.  కానీ ముంబై ఇండియన్స్ తో ఆడిన చివరి మ్యాచ్ లో  కేన్ కూడా గాయంతో ఆ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.  వైస్ కెప్టెన్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ కూడా ఫిట్ గా ఉండకపోవడంతో మనీష్ పాండే సన్ రైజర్స్ ను నడిపించాడు.  

click me!

Recommended Stories