శ్రేయాస్ అయ్యర్‌కి గాయం! కొత్త కెప్టెన్‌ని ప్రకటించిన కేకేఆర్... ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్‌కి...

First Published Mar 19, 2023, 7:23 PM IST

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయ్యర్, ఐపీఎల్ ఆడకపోతే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితి...

Image credit: PTI

ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ కాకపోతే సూర్యకుమార్ యాదవ్ లేదంటే ఇషాన్ కిషన్ ఇలా స్టార్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చు. అయితే కేకేఆర్ పరిస్థితి అలా కాదు...
 

KKR


కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్‌లో టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్ మాత్రమే అంతో కొంతో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉన్నవాళ్లు. అయితే ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో టీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించగలరా? అంటే చెప్పడం కష్టం...

Image credit: PTI

అయితే ఐపీఎల్ 2023 సీజన్‌కి కేకేఆర్, ఓ సర్‌ప్రైజింగ్ ప్లేయర్‌ని కెప్టెన్‌గా ప్రకటించబోతుందా? అనేది అనుమానంగా మారింది. కేకేఆర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రింకూ సింగ్ 37 బంతుల్లో 89 పరుగులు చేసి అదరగొట్టాడు. దీని గురించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది కోల్‌కత్తా...
 

దీనికి ‘లార్డ్ రింకూ సింగ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘మా న్యూ కెప్టెన్’ అంటూ రిప్లై ఇచ్చింది కేకేఆర్. ఆ తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ల రూపంలో ఈ కామెంట్ తెగ వైరల్ అవుతోంది...
 

రింకూ సింగ్‌కి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా లేదు. అంతేకాదు, ఐపీఎల్‌లోనూ ఎక్కువ రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రింకూ 30 ఫస్ట్ క్యాచ్ మ్యాచులు, 41 లిస్టు ఏ మ్యాచులు ఆడాడు..
 

Rinku Singh

కేకేఆర్‌లో ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. అలాంటి వారందరినీ పక్కనబెట్టి రింకూ సింగ్‌కి కెప్టెన్సీ ఇవ్వడమంటే చాలా పెద్ద సాహసమే...

అలాంటి సాహసం కేకేఆర్ చేస్తుందా? లేక కేవలం పబ్లిసిటీ కోసం చేసిన కామెంట్ మాత్రమేనా? అనేది త్వరలో తేలిపోనుంది. శ్రేయాస్ అయ్యర్‌ గాయం అంత తీవ్రమైనదేమీ కాదని, అతను ఐపీఎల్ సమయానికి కోలుకుంటాడని కూడా వార్తలు వినిపిస్తుండడం కొసమెరుపు..

click me!