డేవిడ్ వార్నర్‌కి ఈ టీమ్ అంటే ఇంతిష్టమో... భువీని చూడగానే కాళ్లు మొక్కి, కౌగిలించుకుని...

Published : Apr 24, 2023, 10:57 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి ఆడిన దానికంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుపున ఆడేటప్పుడే ఎక్కువగా ఎంజాయ్ చేసేవాడు డేవిడ్ వార్నర్. కోహ్లీ భార్య అనుష్క ఎప్పుడూ ఆర్‌సీబీ సపోర్టుగా పోస్టులు చేసింది లేదు, రోహిత్ శర్మ భార్య రితికా ఎప్పుడూ ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకున్నది లేదు. కానీ వార్నర్ ఫ్యామిలీ మొత్తం ఆరెంజ్ ఆర్మీ డ్రెస్సుల్లో కనిపించి, సపోర్ట్ చేసేవాళ్లు...

PREV
18
డేవిడ్ వార్నర్‌కి ఈ టీమ్ అంటే ఇంతిష్టమో... భువీని చూడగానే కాళ్లు మొక్కి, కౌగిలించుకుని...

హైదరాబాద్‌ని తన రెండో హోం టౌన్‌గా ప్రకటించిన డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ గాయపడడంతో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సమయంలో డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్లాడు..
 

28

భువీని హగ్ చేసుకుంటాడని అనుకుంటే, వెంటనే అతని కాళ్ల మీద నమస్కరించి, లేచి హగ్ చేసుకున్నాడు. డేవిడ్ వార్నర్ చేస్తున్న పనికి, భువనేశ్వర్ కుమార్ పక్కనే నిలబడి మాట్లాడుతున్న భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా షాక్ అయ్యాడు...

38

దీంతో డేవిడ్ వార్నర్ ఏ టీమ్‌కి వెళ్లినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అంటే అతనికి ఉన్న అనుబంధం ఎప్పటికీ విడదీయరానిదని అంటున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ టీమ్ నుంచి వెళ్లినా, తెలుగు ఫ్యాన్స్‌ని, తెలుగు హీరోలను మరిచిపోని డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా టీమ్‌కి రిటైర్మెంట్ ఇచ్చాక భాగ్యనగరంలో సెటిల్ అవ్వాలని కోరుతున్నారు ఆయన అభిమానులు...

48

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను సొంత ఫ్రాంఛైజీగా భావించి, అభిమానించి, ఆరాధించాడు డేవిడ్ వార్నర్. అయితే 2021 సీజన్‌లో సీన్ మొత్తం మారిపోయింది. ఆరెంజ్ ఆర్మీ టీమ్ , వార్నర్ భాయ్‌‌ను అన్ని విధాలుగా అవమానించింది... 

58

సీజన్ ఫస్టాఫ్‌లో ఆరింట్లో ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం... కేన్ విలియంసన్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించింది...

ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి టాప్ స్కోరర్‌గా ఉంటూ, 2016లో కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు వార్నర్ భాయ్...

68

అలాంటి డేవిడ్ వార్నర్‌ను ఏ కారణం చెప్పకుంండా కెప్టెన్సీ నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది... కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత తుదిజట్టులో కూడా డేవిడ్ వార్నర్‌కి ప్లేస్ కరువైంది. ఆఖరికి మ్యాచ్ చూసేందుకు కూడా తనని స్టేడియానికి అనుమతించలేదని వాపోయాడు వార్నర్...

78
Image credit: PTI

అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2022 మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ని రిటైన్ చేసుకోలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ, టీమ్ మొత్తాన్ని వేలానికి వదిలేసింది. 

88

2022 సీజన్‌ మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ని, ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా, ఆ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కేన్ విలియంసన్‌ని కూడా వేలానికి విడుదల చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 

అటు డేవిడ్ వార్నర్, ఇటు కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ వేరే టీమ్స్‌కి వెళ్లిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఉన్న కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పడిపోయింది.

click me!

Recommended Stories