ధోనీ కావాలని మ్యాచ్‌లను లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్తాడు, ఎందుకంటే... షేన్ వాట్సన్ కామెంట్...

First Published Apr 14, 2023, 5:39 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో విజయాన్ని అందుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. మరో మ్యాచ్ ఓడితే ఢిల్లీ ప్లేఆఫ్స్ ఛాన్సులు క్లిష్టం అయిపోతాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, తన ఆటో బయోగ్రఫీ ‘ది ఇన్నర్ బాటిల్’లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు...

‘ఐపీఎల్‌లో నేను చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. ఎం.ఎస్.ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ టీమ్‌ని ఓ కుటుంబంలా నిర్మించారు. వికెట్లు తీయకపోయినా, పరుగులు చేయకపోయినా టీమ్‌లో ప్లేస్ ఉండదనే భయం అక్కడ ప్లేయర్లలో ఉండదు..

ఎందుకంటే కోచ్ కానీ, ధోనీ కానీ ఇలాంటి మాటలు చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. నేను సీఎస్‌కేకి ఆడిన రెండో ఏడాది ఇప్పటికీ నా మదిలో అలా నిలిచిపోయింది. టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. వేరే టీమ్ అయితే బాగా ఆడకపోతే ప్లేయర్లను మార్చేస్తూ ఉంటారు. ఒకటి రెండు మ్యాచులు బాగా ఆడకపోతే వేరే ప్లేయర్‌ని ఆడించాలని భావిస్తారు..
 

Latest Videos


అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో వాతావరణం అలా ఉండదు. ప్లేయర్లపై పూర్తి భరోసా, నమ్మకం పెడతారు. వారి సామర్థ్యాన్ని వాళ్లకు గుర్తు చేస్తారు. నిజానికి నేను నెగిటివ్ టీమ్ వాతావరణానికి బలైన వాడినే. అందుకే పాజిటివ్ టీమ్ వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. బాగా ఆడగలిగాను..

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో వాతావరణం కూడా ఇలాగే ఉంటుంది. మ్యాచ్‌లను ఎప్పుడూ చివరి దాకా తీసుకురాకూడదని మేం అనుకున్నాం. ఎంత త్వరగా వీలైంత అంత త్వరగా మ్యాచ్‌లను ఫినిష్ చేయాలని అనుకుంటాం. అయితే ధోనీ మాత్రం ఈ విషయంలో పూర్తిగా వేరేగా ఆలోచిస్తాడు..

ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్తాడు. చాలాసార్లు ఎందుకు ఇలా చేస్తాడని ఆలోచించా. ఓసారి అడిగేశాను కూడా.. ‘‘లాస్ట్ ఓవర్ వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్లడమే నాకు ఇష్టం. ఎందుకంటే చివరి ఓవర్‌ వరకూ మ్యాచ్ వెళితే బౌలర్లలో ప్రెషర్ పెరుగుతుంది. అది వాళ్లు ఎక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఇస్తుంది..
 

ఒకవేళ ముందుగానే మనం వేగంగా ఆడాలని ప్రయత్నించి అవుట్ అయితే, తర్వాత వచ్చే బ్యాటర్ ఒత్తిడికి గురి కావచ్చు. రిజల్ట్ మారిపోవచ్చు. అందుకే స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ చివరి ఓవర్ వరకూ మ్యాచ్ వెళితే, అది మన చేతుల్లో ఉన్నట్టే...’’ అంటూ చెప్పాడు. అతని సమాధానం నాకు ఇప్పటికీ గుర్తింది..

ధోనీ ఇప్పటికీ అదే చేస్తున్నాడు. తన టీమ్ ప్లేయర్లను కూడా అలాగే తయారుచేస్తున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లకు మాత్రం ఇది చాలా కొత్తగా ఉంటుంది. అయితే ధోనీ టీమ్‌లో కుదురుకుపోతే, చాలా విషయాలు నేర్చుకోవచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్..
 

sandeep sharma dhoni

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే ఆఖరి ఓవర్‌లో 3 పరుగుల తేడాతో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. చివరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు కావాల్సి ఉండగా మొదటి 3 బంతుల్లో 14 పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆఖరి 3 బంతుల్లో 3 సింగిల్స్ మాత్రమే రావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు..

click me!