సిక్సర్లు కొట్టడంలో సీఎస్కే రికార్డు.. ఆ రెండు జట్లను వెనక్కి నెట్టిన చెన్నై..

First Published Apr 24, 2023, 10:44 AM IST

IPL 2023: ఈ మ్యాచ్ లో  చెన్నై  బ్యాటర్లు  18 సిక్సర్లు కొట్టారు.  అంటే  చెన్నై చేసిన  235 పరుగులలో 108  రన్స్ సిక్సర్ల ద్వారా వచ్చినవే.  

ఐపీఎల్ -16లో  చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతోంది.  గత సీజన్ లో పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచిన  ఆ జట్టు ఇప్పుడు  మాత్రం వరుస విజయాలతో ప్రత్యర్థులకు షాకిస్తున్నది.   ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో  ఆ జట్టే నెంబర్ వన్ గా ఉంది. కాగా కేకేఆర్ తో మ్యాచ్ లో  సీఎస్కే తన రికార్డును తానే బ్రేక్ చేయడంతో  రాజస్తాన్ రికార్డును కూడా సమం చేసింది .

ఈ మ్యాచ్ లో  చెన్నై  బ్యాటర్లు  18 సిక్సర్లు కొట్టారు.  అంటే  చెన్నై చేసిన  235 పరుగులలో 108  రన్స్ సిక్సర్ల ద్వారా వచ్చినవే.    చెన్నై టీమ్ లో  క్రీజులోకి వచ్చిన బ్యాటర్లో ధోని తప్ప  ప్రతీ బ్యాటర్ సిక్సర్లు బాదారు.  

Latest Videos


Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్ 3, కాన్వే 3,   అజింక్యా రహానే  5, శివమ్ దూబే 5,   రవీంద్ర జడేజా లు 2 సిక్సర్లు కొట్టారు. తద్వారా  చెన్నై గతంలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తన రికార్డు (17) ను తానే చెరిపేసుకుంది.   ఐపీఎల్ లో చెన్నై.. ఒక ఇన్నింగ్స్ లో 17 సిక్సర్లను ఏకంగా నాలుగు  సార్లు కొట్టడం విశేషం. 

కేకేఆర్ తో మ్యాచ్  లో 18 సిక్సర్లు కొట్టడం ద్వారా చెన్నై.. రాజస్తాన్ రాయల్స్  18 రికార్డులను సమం చేసింది.  అంతేగాక  ఒక ఇన్నింగ్స్ లో  17 సిక్సర్లు కొట్టిన  కేకేఆర్,  రాజస్తాన్ రికార్డులను  బ్రేక్ చేసింది.  

Image credit: PTI

ఐపీఎల్ లో  ఒక  ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. ఆర్సీబీ.. పూణె వారియర్స్ పై  2013లో   21 సిక్సర్లు బాదింది.   ఆ తర్వాత  రెండో స్థానంలో కూడా ఆర్సీబీనే ఉంది.  2016లో ఆర్సీబీ.. గుజరాత్ లయన్స్ పై  20 సిక్సర్లు కొట్టింది.  మూడో స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (2017 లో - 20 సిక్సర్లు)  ఉంది.  

ఇక ఐపీఎల్  చెన్నైకి థర్డ్ హయ్యస్ట్ స్కోరు. ఆ జట్టు 2010లో  రాజస్తాన్ రాయల్స్ పై   246 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ  తర్వాత పంజాబ్ కింగ్స్ పై  240  చేసింది.  ఇప్పుడు  కేకేఆర్ పై 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానం ఆర్సీబీదే. ఆ జట్టు.. 2013లో  పూణె వారియర్స్ పై  263 పరుగులు సాధించింది. 
 

click me!