అజింకా రహానేకి ఏం డ్రింక్ ఇచ్చావ్ ధోనీ... టెస్టులు ఆడే బ్యాటర్‌తో సిక్సర్ల సునామీ! ఇదేం దంచుడు...

First Published Apr 23, 2023, 10:27 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏం ఊహించని ప్లేయర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా అసలు తుది జట్టులోకి వస్తాడా? అనుకున్న అజింకా రహానే బ్యాటింగ్ చూస్తే, క్రికెట్ ఫ్యాన్స్‌కి పూనకాలు లోడింగ్.. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రహానేని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూడలేదు...

ముంబై ఇండియన్స్‌లో ఐపీఎల్ కెరీర్ మొదలెట్టిన అజింకా రహానే, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్స్‌కి ఆడాడు. మొదటి రెండు సీజన్లలో 10 మ్యాచులు ఆడిన రహానే, పెద్దగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో 2010లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

rahane

2011లో రాజస్థాన్ రాయల్స్‌కి వెళ్లిన అజింకా రహానే, 2012 సీజన్‌లో 560 పరుగులు చేశాడు. ఇందులో ఆర్‌సీబీపై చేసిన ఓ సెంచరీ కూడా ఉంది. 2013లో 488, 2014లో 339, 2015 సీజన్‌లో 540, 2016లో 480 పరుగులు చేసిన అజింకా రహానే... 2018, 2019 సీజన్లలో 370, 393 పరుగులు చేశాడు...

Latest Videos


Ajinkya Rahane

అయితే 2020 నుంచి అజింకా రహానేకి బ్యాడ్ టైం మొదలైంది. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 9 మ్యాచులు ఆడి 113 పరుగులే చేసిన అజింకా రహానే, 2021లో రెండే మ్యాచులు ఆడాడు...
 

Ajinkya Rahane

వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయిన అజింకా రహానేని టీమ్ నుంచి తప్పించిన రిషబ్ పంత్, ‘ఆ ప్లేయర్ పేరు గుర్తు లేదు, అతను బాగా ఆడడం లేదని టీమ్ నుంచి తప్పించి, వేరే ప్లేయర్‌ని తీసుకొచ్చాం...’ అంటూ కామెంట్ చేశాడు... 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అజింకా రహానే, రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చి, అతను తిరిగి మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇవ్వడానికి కారణమయ్యాడు. అలాంటి అజింకా రహానేకి ఇది తీవ్ర అవమానమే.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వచ్చిన అజింకా రహానే, 7 మ్యాచుల్లో 133 పరుగులు చేసి నిరాశపరిచాడు. గాయంతో సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. బాగా ఆడిన మ్యాచుల్లో, 500+ పరుగులు చేసిన సీజన్లలో కూడా అజింకా రహానే స్ట్రైయిక్ రేటు ఎప్పుడూ 140+ కూడా దాటలేదు..

అలాంటి అజింకా రహానేని బేస్ ప్రైజ్‌ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. మొయిన్ ఆలీ గాయపడడంతో టీమ్‌లోకి వచ్చిన అజింకా రహానే, ముంబైతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు...

అది ఏదో గాలివాటుగా వచ్చిన ఇన్నింగ్స్ కాదని నిరూపిస్తూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన రహానే.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు..

తాజాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో 162 మ్యాచులు ఆడిన అజింకా రహానే, 200+ స్ట్రైయిక్ రేటుతో ఆడిన రెండు మ్యాచులు కూడా ఈ సీజన్‌లోనే వచ్చాయి...
 

అసలు కెరీర్ ముగిసిపోయిందనుకున్న అజింకా రహానే, ఎవ్వరూ ఊహించని విధంగా పర్ఫామెన్స్ ఇస్తూ చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఎవరు బాగా ఆడినా ఆ క్రెడిట్ ధోనీకే ఇవ్వడం ఫ్యాన్స్‌కి అలవాటు...

Ajinkya Rahane

అలాంటిది ధోనీ టీమ్‌ తరుపునే అజింకా రహానే అదరగొడుతుండడంతో రహానే 2.0 వర్షన్ క్రెడిట్ మొత్తం మాహీ ఖాతాలోనే వేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడనుంది టీమిండియా...

click me!