ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్! వర్కవుట్ అయ్యిందో...

Published : Apr 16, 2023, 03:46 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా వచ్చిన రూల్ ఇంపాక్ట్ ప్లేయర్. తుది జట్టులో లేని ఓ ప్లేయర్‌ని, ఈ రూల్ వాడి మ్యాచ్ ఆరంభమయ్యాక అవసరమైనప్పుడు టీమ్‌లోకి తీసుకురావచ్చు. కొన్ని టీమ్స్‌కి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ బాగా ఉపయోగపడితే, మరికొన్ని సందర్భాల్లో రివర్స్‌లో ప్రత్యర్థి టీమ్స్‌కి బాగా ఉపయోగపడ్డారు...

PREV
15
ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్! వర్కవుట్ అయ్యిందో...
Image credit: PTI

ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని వాడితే అది ఓ రకంగా కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌లాగే ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓ ప్లేయర్ బ్యాటింగ్ చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో అతని ప్లేస్‌లో మరో బౌలర్ టీమ్‌లోకి వచ్చి బౌలింగ్ చేస్తాడు. ఇది చాలా రొటీన్‌గా ఇంపాక్ట్‌ని వాడే విధానం...

25

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ఎలా వాడాలో బాగా తెలిసిన టీమ్స్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అవుటైన బ్యాటర్ ప్లేస్‌లో మరో బ్యాటర్‌ని తీసుకొచ్చాయి. ఇది 11 మంది టీమ్‌ని కాస్తా 12 మంది ప్లేయర్లున్న టీమ్‌గా మార్చేస్తుంది.. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ విధంగా ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడి 12 మందితో బ్యాటింగ్ చేయించాయి...

35
PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000200B)

తాజాగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగలేదు. కడుపు నొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో ఆడడం లేదని కామెంట్ చేశాడు తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్. అయితే రోహిత్‌కి ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్టులో ప్లేస్ దక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..

45

కడుపు నొప్పి నిజమే అయితే అతను రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకుంటే ఓ బౌలర్ ప్లేస్‌లో టీమ్‌లోకి రావచ్చు. అలా కూడా కాదనుకుంటే ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ లేదా కామెరూన్ గ్రీన్ అవుటైన తర్వాత అతని ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మను తీసుకు రావచ్చు...

55
Rohit Sharma

ఇలా ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని వాడితే కేకేఆర్‌ని నిలువరించడానికి మరో సూపర్ సెన్సేషన్ బ్యాటర్‌ని అదనంగా వాడినట్టే. మరి ముంబై ఇండియన్స్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ సరిగ్గా వర్కవుట్ అవుతుందో లేదో ఈ మ్యాచ్ రిజల్ట్‌ డిసైడ్ చేస్తుంది.. 

Read more Photos on
click me!

Recommended Stories