ఐపీఎల్ 2023 సీజన్ జోరుగా సాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, శ్రీలంక.. ఇలా దాదాపు అన్ని దేశాల కీలక ప్లేయర్లు, ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఒక్క పాకిస్తాన్ తప్ప! పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్ ఆడే అవకాశం లేకపోవడంతో ఐపీఎల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ప్లేయర్లతో నిండిన న్యూజిలాండ్‌తో కలిసి సిరీస్ ఆడుతోంది..
ట్రెంట్ బౌల్ట్, డివాన్ కాన్వే, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్, మిచెల్ సాంట్నర్... ఇలా న్యూజిలాండ్ కీ ప్లేయర్లు అందరూ ప్రస్తుతం ఐపీఎల్‌లోనే బిజీగా ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గాయపడి, స్వదేశానికి తిరిగి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు...
28
కీ ప్లేయర్లు లేకుండా, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లను పాకిస్తాన్ పర్యటనకు పంపింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఇది న్యూజిలాండ్ A టీమ్ కాదు కదా న్యూజిలాండ్ B కూడా కాదు. న్యూజిలాండ్ C టీమ్‌తో సమానం. ఈ టీమ్‌పై అదీ స్వదేశంలో తన ప్రతాపాన్ని చూపిస్తూ చెలరేగిపోతోంది పాకిస్తాన్...
38
Babar Azam
తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని 94 పరుగులకి ఆలౌట్ చేసి, 88 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది పాకిస్తాన్. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసి అవుటైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు..
48
Babar Azam
తొలి మ్యాచ్‌లో 8 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి తొలి వికెట్‌కి 99 పరుగులు జోడించాడు బాబర్ ఆజమ్. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుట్ కాగా బాబర్ ఆజమ్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి... సెంచరీ సాధించాడు..
58
Image credit: Getty
టీ20ల్లో బాబర్ ఆజమ్‌కి ఇది మూడో సెంచరీ. లాహోర్‌లోని తారు రోడ్డు లాంటి పిచ్‌పై వచ్చిన ఈ సెంచరీతో పాకిస్తాన్, 192 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ 154 పరుగులకి పరిమితం కావడంతో రెండో టీ20లో 38 పరుగుల తేడాతో విజయం అందుకుంది పాకిస్తాన్...
68
Babar Azam
ఈ పర్యటనలో న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో 5 టీ20 మ్యాచులు ఆడనుంది. మిగిలిన మూడు టీ20 మ్యాచుల్లో బాబర్ ఆజమ్... ఇలాగే కివీస్ C టీమ్ బౌలర్లపై చెలరేగిపోయి సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొడితే... ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌కి రావడం ఖాయం..
78
Image credit: PTI
జింబాబ్వే, శ్రీలంక, నెదర్లాండ్స్ వంటి టీమ్స్‌పై ప్రతాపం చూపించి, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని అనుభవిస్తున్న బాబర్ ఆజమ్, టీ20ల్లో ప్రస్తుతం టాప్ 3లో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ టాప్ 2లో ఉన్నాడు. టాప్ 1లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 906 పాయింట్లతో ఉంటే రిజ్వాన్ 811, బాబర్ ఆజమ్ 755 పాయింట్లతో ఉన్నారు...
88
Babar Azam
పాయింట్ల మధ్య ఎక్కువగా ఉండడంతో బాబర్ ఆజమ్, ఐసీసీ నెం.1 ర్యాంకుని చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఐదు టీ20ల సిరీస్, అదీ స్వదేశంలో, అంతేకాకుండా ఏ మాత్రం అనుభవం లేని బౌలింగ్ టీమ్‌పై కావడంతో ఏదైనా జరగొచ్చు. వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసి, టాప్ ర్యాంకుని కొట్టేయను వచ్చు. ఐపీఎల్ టైమ్‌లో పాక్ క్రికెట్ బోర్డు, ఈ సిరీస్ పెట్టిందే బాబర్ ఆజమ్ కోసమని చెప్పాల్సిన పని లేదు..