ఆలోచించిన ఆశాభంగం.. అసలే ఆస్ట్రేలియా, అజింక్యాను పట్టుకురండి..!

Published : Apr 24, 2023, 01:41 PM IST

IPL 2023: టీమిండియా వెటరన్  బ్యాటర్ అజింక్యా రహానే తనలోని  2.0 ను చూపిస్తున్నాడు. రహానే పనైపోయిందనుకున్నవారికి తానేంటో నిరూపిస్తున్నాడు.   

PREV
17
ఆలోచించిన ఆశాభంగం.. అసలే ఆస్ట్రేలియా, అజింక్యాను పట్టుకురండి..!

భారత  క్రికెట్ వెటరన్ బ్యాటర్, టెస్టులలో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా చేసిన అజింక్యా రహానే   ఈ ఐపీఎల్ సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ‘రహానేలో ఇంత దూకుడు ఉందా..?’ అన్నంత రేంజ్  లో  చెలరేగుతున్నాడు. 

27
Image credit: PTI

‘రహానే పనైపోయింది’ అని విమర్శలు చేసినవారికి తనలోని 2.0  ను చూపిస్తూ  వాళ్లే నోరెళ్లబెట్టేలా  దంచికొడుతున్నాడు. చెన్నై రూ. 16 కోట్లు వెచ్చించి  దక్కించుకున్న  బెన్ స్టోక్స్   మూడు మ్యాచ్ లలో ఆడినా  అతడు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అతడి స్థానంలో ఆడుతున్న రహానే  మాత్రం  చెన్నైకి ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజీ అయ్యాడు.  

37

వాంఖెడే వేదికగా ముంబైతో ఆడిన  మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన రహానే.. 27 బంతుల్లోనే  61 పరుగులు చేసి  రోహిత్ సేనకు షాకిచ్చాడు.  ఇదే క్రమంలో  రహానే.. రాజస్తాన్ పై   19 బంతుల్లో 31,  బెంగళూరుపై  20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ పై 9 పరుగులే చేసి విఫలమైనా నిన్న  కోల్కతా తో జరిగిన  మ్యాచ్ లో   29 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. 
 

47

కేకేఆర్ తో అతడి ఇన్నింగ్స్ లో  ఆరు బౌండరీలు,  5 భారీ సిక్సర్లు ఉన్నాయి.  ఈ క్రమంలో రహానే స్ట్రైక్ రేట్  కూడా  244.83 గా ఉంది.  డెవాన్ కాన్వే, శివమ్ దూబే లతో కలిసి రహానే.. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడటంతో  చెన్నై  భారీ స్కోరు చేసింది. 

57

ఇదిలాఉండగా రహానే 2.0లో  రెచ్చిపోయి ఆడుతుండటంతో అతడిని మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  జూన్ లో భారత జట్టు  ఇంగ్లాండ్ వేదికగా ఆడబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో  అతడిని ఆడించాలని   కోరుతున్నారు.  రహానే ను దూరం చేసుకోవద్దని  సూచిస్తున్నారు. 

67

వరల్డ్ టెస్ట్ ఛాంపనియన్షిప్  ఫైనల్ కోసం భారత జట్టును  ఈ నెల చివర్లో గానీ  లేకుంటే వచ్చే నెల గానీ   ప్రకటించే అవకాశముంది.  అయితే ఈసారి రహానే కు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  శ్రేయాస్ అయ్యర్ కు సర్జరీ, రిషభ్ పంత్ కు గాయం, కెఎల్ రాహుల్ చెత్త ఫామ్ రహానేకు కలిసొచ్చేవే.  

77

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ ట్రాక్ ల మీద ఆసీస్ ను ఓడించినంత ఈజీగా ఓవల్ గ్రౌండ్ లో కంగారూలను  పడగొట్టడం అంత ఈజీ కాదు.  ఫాస్ట్   బౌలింగ్ ట్రాక్ అయిన ఓవల్ లో  రహానే వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే అది జట్టుకు మంచిదని  ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  2022లో దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లిన భారత జట్టులో ఆడిన రహానే.. తర్వాత ఫామ్ కోల్పోయి దేశవాళీకే పరిమితమయ్యాడు. 

click me!

Recommended Stories