ఢిల్లీకి మరో ప్లేయర్ దూరం.. రిప్లేస్‌మెంట్ గా మరో అండర్ - 19 కెప్టెన్‌నే తీసుకొచ్చిన క్యాపిటల్స్

Published : Apr 24, 2023, 11:24 AM IST

IPL 2023: ఐపీఎల్ - 2023 సీజన్ లో వరుసగా ఐదు  ఓటముల తర్వాత ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ తో బోణీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. 

PREV
16
ఢిల్లీకి మరో ప్లేయర్ దూరం..  రిప్లేస్‌మెంట్ గా మరో అండర్ - 19 కెప్టెన్‌నే తీసుకొచ్చిన క్యాపిటల్స్

ఐపీఎల్ -16 లో పాయింట్లపట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో  ఆటగాడు దూరమయ్యాడు. ఆ జట్టు  ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్‌కోటి వెన్నుగాయం కారణంగా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్  ఒక ప్రకటనలో వెల్లడించింది. 

26

గాయపడ్డ నాగర్‌కోటి   ప్లేస్ లో  ఉత్తరప్రదేశ్ బ్యాటర్,  భారత జట్టు అండర్  -19 మాజీ  సారథి ప్రిమయ్ గార్గ్ ను   రిప్లేస్‌మెంట్ గా ప్రకటించింది.  ఈ విషయాన్ని ఐపీఎల్ కూడా ధ్రువీకరించింది.  నాగర్‌కోటిని ఢిల్లీ గతేడాది వేలంలో  కోటి పది లక్షల రూపాయలకు   దక్కించుకుంది. 

36

ఐపీఎల్ తన అధికారిక వెబ్‌సైట్ లో   ‘ఉత్తరప్రదేశ్ బ్యాటర్  ప్రియమ్ గార్గ్.. ఢిల్లీ క్యాపిటల్స్ లో  నాగర్‌కోటి   స్థానాన్ని  రిప్లేస్ చేయబోతున్నాడు.   అతడిని  ఢిల్లీ రూ. 20 లక్షల బేస్ ప్రైజ్ తో కొనుగోలు చేసింది.  ఈ అటాకింగ్ బ్యాటర్  2020లో  మొదటిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. మూడు సీజన్ల పాటు  హైదరాబాద్ తోనే ఉన్నాడు..’అని తెలిపింది. 

46

కాగా  పృథ్వీ షా,  యశ్ ధుల్,  షఫాలీ వర్మ  తర్వాత  ఢిల్లీ తరపున మరో అండర్ - 19 కెప్టెన్ ఆడనుండటం గమనార్హం.   ఇక ప్రియమ్ గార్గ్..  2020లో  ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  2020 వేలంలో  అతడిని సన్ రైజర్స్ రూ. 1.90 కోట్లకు దక్కించుకుంది.  2022 వరకూ అతడు హైదరాబాద్ కే ఆడాడు. 

56

ఐపీఎల్ లో  మూడు సీజన్లలో   కలిపి  21 మ్యాచ్ లు ఆడిన గార్గ్..  17 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చాడు.   ఇందులో   15.69 సగటుతో  251 పరుగులు చేశాడు.   2020 సీజన్ లో   సన్ రైజర్స్ అతడిని 14 మ్యాచ్ లు ఆడించింది. కానీ ఆ సీజన్ లో 133 పరుగులే చేశాడు. ఇక తర్వాత రెండు సీజన్లలో  72, 46 పరుగులే చేశాడు.  

66

ఇదిలాఉండగా ఐదు పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్.. నేడు ఉప్పల్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనున్నది. పాత ఫ్రాంచైజీ పై ఢిల్లీ క్యాపిటల్స్  డేవిడ్ వార్నర్ మరోసారి  ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. మరి అతడి పగను  ఢిల్లీ టీమ్ మేట్స్ కూడా పంచుకుంటారా..?  

click me!

Recommended Stories