ప్రశాంతంగా సాగిపోతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్కసారిగా అగ్గి రేగింది. క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఊహించిన మసాలా కూడా యాడ్ అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ టెస్టును తలపించినా... మ్యాచ్ తర్వాత మినీ రణరంగమే జరిగింది...
గ్రౌండ్‌లో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌కి 100 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. విరాట్ కోహ్లీ రూ.1.07 కోట్లు ఫైన్ రూపంలో కోల్పోతే, గౌతమ్ గంభీర్ రూ.25 జరిమానా చెల్లించబోతున్నాడు...
29
Kohli vs Mishar and Naveen
అసలు ఈ ఫైట్ మొత్తానికి కారణమైన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ వుల్ హక్‌కి 50 శాతం మ్యాచ్ ఫీజు కోత పడనుంది. అతను రూ.1.79 లక్షలు ఫైన్ రూపంలో చెల్లించబోతున్నాడు...
39
Rahul-Gambhir
అసలు రాత్రి ఏమైంది? ఎవరిది తప్పు? బెంగళూరులో ఆర్‌సీబీని ఆఖరి బంతికి ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ అతిగా సెలబ్రేట్ చేసుకుంది. గౌతీ, ఆర్‌సీబీ ఫ్యాన్‌కి వేలు చూపిస్తే, ఆవేశ్ ఖాన్ హెల్మెట్ నేలకేసి బాది సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సీన్స్ అన్నీ ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ మనసులో పెట్టుకున్నాడు.
49
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 126 పరుగులే చేసినా లక్ష్యఛేదనలో లక్నో 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా కలిసి కాసేపు వికెట్లకు అడ్డుగా నిలిచి, రెండేసి బౌండరీలు బాదారు.
59
Gautam Gambhir
ఈ సమయంలో నవీన్ వుల్ హక్‌ని విరాట్ కోహ్లీ సెడ్జ్ చేశాడు. ఆ తర్వాత అతను అవుట్ కాగానే అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి నవీన్ వుల్ హక్ రియాక్ట్ కావడంతో గొడవ మొదలైంది...
69
మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో విరాట్ కోహ్లీ చేతిని గట్టిగా పట్టుకుని ఏదో తిట్టాడు నవీన్ వుల్ హక్. దానికి విరాట్ కోహ్లీ స్పందించి, ఏదో తిట్టి ముందుకు వెళ్లిపోయాడు. దీని తర్వాత కెఎల్ రాహుల్ వచ్చి, విరాట్ కోహ్లీతో ఏం జరిగిందని అడిగాడు...
79
నవీన్ వుల్ హక్ అటుగా వచ్చినా, విరాట్ కోహ్లీతో మాట్లాడనని సైగలు చేస్తూ వెళ్లిపోయాడు. లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్ వచ్చి విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతుంటే, అక్కడికి వచ్చిన గంభీర్, అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో గంభీర్ మళ్లీ ఏదో అన్నాడు..
89
దీంతో విరాట్ కోహ్లీ కోపంగా వెళ్లి, ‘ఏం జరిగిందో చెబుతా విను’ అంటూ వివరించే ప్రయత్నం చేశాడు. గంభీర్ అతని మాటలు వినడానికి ఇష్టపడకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అమిత్ మిశ్రా, కెఎల్ రాహుల్ తదితరులు కలిసి ఈ ఇద్దరినీ శాంతపరిచే ప్రయత్నం చేశారు..
99
విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ మొదలైన గొడవ విరాట్ కోహ్లీ వర్సెస్ లక్నో టీమ్‌గా మారింది. విరాట్ ఒక్కడిని చేసి గంభీర్, మిశ్రా, నవీన్ వుల్ హక్, మేయర్స్ మాటల దాడి చేశారు... ఆర్‌సీబీ నుంచి మరో టీమ్ ప్లేయర్, కోహ్లీకి సపోర్ట్‌గా రియాక్ట్ కాకపోవడం విశేషం.