ఆల్‌రౌండర్ అన్నారు, బ్యాటింగ్‌కి పంపడానికి అంత భయపడుతున్నారే! పియూష్ చావ్లా తర్వాత క్రీజులోకి అర్జున్...

Published : Apr 26, 2023, 03:48 PM ISTUpdated : Apr 26, 2023, 04:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన బౌలర్ అర్జున్ టెండూల్కర్. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్ తీశాడు...

PREV
18
ఆల్‌రౌండర్ అన్నారు, బ్యాటింగ్‌కి పంపడానికి అంత భయపడుతున్నారే! పియూష్ చావ్లా తర్వాత క్రీజులోకి అర్జున్...
arjun tendulkar six

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు సమర్పించిన అర్జున్ టెండూల్కర్, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు...

28
PTI Photo) (PTI04_25_2023_000273B)

అప్పటిదాకా 150+ స్కోరు చేయడమే కష్టం అనుకున్న పంజాబ్ కింగ్స్, అర్జున్ టెండూల్కర్ ఓవర్ తర్వాత బౌండరీలతో విరుచుకుపడి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ స్కోరు 200 మార్కు దాటేసింది.. 

38
PTI Photo/Kunal Patil)(PTI04_22_2023_000465B)

ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే అనుమానాలు రేగినా, సచిన్ వారసుడు కావడంతో అతన్ని కొనసాగించాడు రోహిత్ శర్మ. మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, తన రెండో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహాని అవుట్ చేసి టైటాన్స్‌కి షాక్ ఇచ్చాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
 

48
Arjun Tendulkar

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎదురైన అనుభవంతో సచిన్ కొడుక్కి మూడో ఓవర్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు రోహిత్ శర్మ. మొదటి 2 ఓవర్లలో 9 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు..

58

అంతాబాగానే ఉంది కానీ అర్జున్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అర్జున్ టెండూల్కర్, బంతి వేయడానికి ముందు ముక్కులో వేలు పెట్టి గెలుక్కున్నాడు. ఇది పెద్ద వింతేమీ కాకపోయినా ముక్కులో పక్కు తీసుకుని నోట్లు వేసుకున్నాడు...
 

68
Arjun Tendulkar-Sachin Tendulkar

అర్జున్ టెండూల్కర్ ఆ పనికి క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వేల కోట్లు సంపాదించిన సచిన్ టెండూల్కర్ కొడుక్కి పంచభక్ష్య పరమాన్నాలు, గోల్డ్ ప్లేటులో విస్తరిస్తారు. అలాంటి అర్జున్, ఇంత చెత్త, ఛెండాలాన్ని నోట్లు వేసుకోవడం చూసి షాక్ అవుతున్నారు...

78
Image credit: PTI

పేరుకి అర్జున్ టెండూల్కర్‌ని ఆల్‌రౌండర్ అని ప్రమోట్ చేసిన ముంబై ఇండియన్స్, అతన్ని బ్యాటింగ్‌కి పంపడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. 8 మంది బ్యాటర్లు అవుటైన తర్వాత కానీ అర్జున్ బ్యాటింగ్‌కి రాలేదు... 
 

88
Image credit: Mumbai Indians/Facebook

ఐపీఎల్‌లో తన మొదటి మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 12 పరుగులు చేసి అవుట్ అయితే, అర్జున్ టెండూల్కర్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో పెద్దగా ఇంప్రెస్ చేయకపోయినా సచిన్ వారసుడు కావడంతో అర్జున్‌కి వరుస అవకాశాలు దక్కుతున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు.. 

click me!

Recommended Stories