ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ బెర్త్‌ని తృటిలో మిస్ చేసుకుంది. అయితే మెగా వేలం తర్వాత ముంబై ఆటతీరు పూర్తిగా మారిపోయింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ దూరంగా ఉంటే, 2023 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు. పేరుకి ఆర్చర్ అయితే వచ్చాడు కానీ ఆడింది 2 మ్యాచులే. అందులో తీసింది ఒక్క వికెట్ మాత్రమే. ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, కలిసి ముంబైకి ఆడితే ఎలా ఉంటుందో కానీ అంతవరకూ ముంబై టీమ్ ఉత్తిదే అనిపిస్తోంది...
28
రూ.15.25 కోట్లు పెట్టి ఇషాన్ కిషన్‌ని తిరిగి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్లేయర్లను వేలానికి వదిలేసింది. వారి కోసం ఖర్చు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ ఇద్దరూ ముంబైలో ఉండి ఉంటే, ముంబైకి ఈ పరిస్థితి వచ్చేది కాదు...
38
సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడరో చెప్పడం చాలా కష్టం. మంచి ఆరంభం దక్కిన తర్వాత కూడా దాన్ని వాడుకుని భారీ స్కోర్లు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు సూర్య, రోహిత్ శర్మ...
48
2022కి ముందు వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్లు కూడా ఖర్చు పెట్టని ముంబై ఇండియన్స్, 2023 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం రూ.17.5 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సగం పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాడు కామెరూన్ గ్రీన్. ఇతని బదులుగా అజింకా రహానే కోసం రూ.1 కోటి ఖర్చు చేసి ఉన్నా, రెట్టింపు రిజల్ట్ దక్కి ఉండేది...
58
Image credit: PTI
గత సీజన్‌లో అదరగొట్టిన అండర్19 ప్లేయర్ డేవాల్డ్ బ్రేవిస్‌ని ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు ముంబై ఇండియన్స్. జే రిచర్డ్‌సన్ కూడా గాయపడడంతో రిలే మెడరిత్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్ వంటి సీ క్లాస్ బౌలర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి...
68
ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ మళ్లీ మునుపటి రేంజ్ పర్ఫామెన్స్ చూపించాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే కిరన్ పోలార్డ్ ఉన్నప్పుడు ఓడిపోయామని అనుకున్న మ్యాచులను కూడా తన సునామీ ఇన్నింగ్స్‌లతో ముగించేవాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు...
78
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000366B)
హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లు వేరే టీమ్స్‌లో సెటిల్ అయిపోయారు. వాళ్లు మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చే అవకాశం లేదు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ చేరిందంటే అది పెద్ద వింతే...
88
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000353B)
ఇప్పుడున్న టీమ్‌లో ఏ ప్లేయర్ అయినా సరిగ్గా ఆడుతున్నాడంటే అది మన తెలుగుకుర్రాడు తిలక్ వర్మే. ఈ సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచుల్లో అదరగొట్టిన తిలక్ వర్మ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయ్యాడు. ఇది టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది.