బౌలర్‌ని చూడకుండా సచిన్‌ని చూసి బ్యాటింగ్ చేసిన రాహుల్ ద్రావిడ్... మాస్టర్ ఐడియాతో ఆ మ్యాచ్‌లో...

First Published Apr 25, 2023, 9:45 PM IST

సాధారణంగా ఏ బ్యాటర్ అయినా బంతి పడేవరకూ అతన్నే గమనిస్తూ ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ అయితే రెప్పకుండా వేయకుండా బౌలర్‌ని చూస్తారు. అయితే ఓ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్‌ మాత్రం నాన్ స్ట్రైయికింగ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌ని చూసి బ్యాటింగ్ చేశాడట...

వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది స్వయంగా సచిన్ టెండూల్కర్ బయటపెట్టిన విషయం కాబట్టి నమ్మి తీరాల్సిందే. విదేశీ పిచ్‌ల మీద ముఖ్యంగా న్యూజిలాండ్ ట్రాక్‌లపై భారత బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. రాహుల్ ద్రావిడ్‌కి కూడా అక్కడ మెరుగైన రికార్డు లేదు...

‘మేం న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాం. బంతి రివర్స్ స్వింగ్ వస్తోంది. కివీస్ బౌలర్ క్రిస్ కెయిన్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఓ సారి ఇన్‌స్వింగర్, మరోసారి అవుట్ స్వింగర్ వేస్తూ బాగా కంఫ్యూజ్ చేస్తున్నాడు...

Latest Videos


రాహుల్ ద్రావిడ్ కూడా క్రిస్ కెయిన్స్ బౌలింగ్ ఫేస్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. ఓవర్ల మధ్యలో నాకు ఓ ఐడియా వచ్చింది. ద్రావిడ్ దగ్గరికి వెళ్లి, నేను నాన్-స్ట్రైయికింగ్‌లో ఉన్నా కాబట్టి అతను ఏ బాల్ వేయబోతున్నాడో నేను దగ్గర్నుంచి చూడగలుగుతాను..

కాబట్టి అతను ఏ యాంగిల్‌లో బంతి పట్టుకున్నాడో నాకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి అతను ఏ వైపు బంతి పట్టుకున్నాడో అటు వైపు నా బ్యాటు పెడతా. ఒకవేళ అవుట్ స్వింగర్ వేయబోతున్నాడని తెలిస్తే నేను, బ్యాటు లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకుంటా, ఇన్‌స్వింగర్ అని తెలిస్తే, కుడి చేతి వైపు బ్యాటు పట్టుకుంటా... అని చెప్పాను.

Sachin Dravid

నేను బ్యాటు పట్టుకునే సైడ్‌ని చూసి బంతి యాంగిల్‌ని అంచనా వేయమని చెప్పా. అనుకున్నట్టే ఆ తర్వాతి ఓవర్‌లో రాహుల్ ద్రావిడ్ రెండు స్ట్రైయిట్ డ్రైవ్‌లు, మరో రెండు కవర్ డ్రైవ్‌లు బాదేశాడు. బంతి వేయడానికంటే ముందే బౌలర్‌ని చూడకుండా నా బ్యాటు యాంగిల్‌ని చూసేవాడు రాహుల్ ద్రావిడ్...

Chris Cairns

వరుసగా బౌండరీలు రావడంతో అతని రిథమ్ పోయింది. క్రిస్ కెయిన్స్‌కి ఏదో మతలబు చేస్తున్నారని అర్థమైంది.  ఆ తర్వాతి బంతిని క్రాస్ సీమ్ వేశాడు. బంతి ఎటు పడుతుందో నాక్కూడా తెలియకుండా దాచాడు. ఆ బంతిని ఆడలేక రాహుల్ ద్రావిడ్ బీట్ అయ్యాడు. 

Image credit: PTI

వెంటనే నా వైపు తిరిగి దీనికి నీ దగ్గర ఏ సిగ్నల్ లేదా అన్నాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే బౌలర్ ఏ యాంగిల్‌లో వేస్తున్నాడో తెలియకపోతే నేను బ్యాటుని మిడిల్‌లో పట్టుకుంటా అని చెప్పాను... ఎప్పుడూ కూడా నీ ప్రత్యర్థి కంటే ఓ అడుగు ముందు ఉండడం చాలా అవసరం...’ అంటూ ఓ కార్యక్రమంలో బయటపెట్టాడు సచిన్ టెండూల్కర్.. 

16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి, 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు ‘మాస్టర్ బాస్టర్’ సచిన్ టెండూల్కర్. 100 అంతర్జాతీయ సెంచరీలు, వందల్లో 50+ స్కోర్లు, 34 వేలకు పైగా పరుగులు సాధించిన సచిన్, తన క్రికెట్‌ కెరీర్‌లో ఇలాంటి అనుభవాలెన్నో...

click me!