ఆర్‌సీబీ గెలుపుతో అస్సాం ట్రైన్ ఎక్కేసిన పంజాబ్ కింగ్స్... ఆ రెండు జట్లకు కూడా కష్టమే...

Published : May 19, 2023, 09:48 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ క్లైమాక్స్‌కి చేరుకుంటున్నా ఇంకా ప్లేఆఫ్స్‌పై క్లారిటీ రాలేదు. కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టాప్ 4లోకి దూసుకొచ్చింది...

PREV
19
ఆర్‌సీబీ గెలుపుతో అస్సాం ట్రైన్ ఎక్కేసిన పంజాబ్ కింగ్స్... ఆ రెండు జట్లకు కూడా కష్టమే...
SRH vs RCB

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఆర్‌సీబీ ఓడిపోయి ఉంటే 15 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్స్ చేరి ఉండేవి. అయితే ఆర్‌సీబీ విజయంతో సీన్ మారింది...

29
rcb srh

14 పాయింట్లతో ఉన్న ఆర్‌సీబీ, ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది...

39

15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది సీఎస్‌కే. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ‌లకు ఛాన్సులు పెరుగుతాయి..

49

లక్నో సూపర్ జెయింట్స్ కూడా 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో లక్నో, కేకేఆర్‌తో తలబడుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో నేరుగా ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది. ఓడితే మాత్రం లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలు... ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ఆడే ఆఖరి మ్యాచుల రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుంది..

59

ఐదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ఆఖరి మ్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అయితే ఆర్‌సీబీతో ఆఖరి మ్యాచ్‌లో టైటాన్స్‌పై గెలిస్తే, ఇరు జట్లు 16 పాయింట్లతో ఉంటాయి. కాబట్టి ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.

69
Image credit: PTI

రాజస్థాన్ రాయల్స్, ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలబడుతోంది. 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ఆఖరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ భారీ తేడాతో గెలిస్తే... ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు ఉంటాయి..

79

కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్‌ది కూడా ఇదే కథ. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 130+ తేడాతో గెలిచి... ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు మాత్రమే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరగలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే. కాబట్టి పంజాబ్ కింగ్స్ కూడా దాదాపు అస్సాం ట్రైన్ ఎక్కేసినట్టే...
 

89
Image credit: PTI

కేకేఆర్‌ కూడా ఇంతే. చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడుతున్న కోల్‌కత్తా, ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి... ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో ఓడిపోతే  నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి..

99

అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ చేరే టీమ్స్‌ని డిసైడ్ చేయబోతున్నాయి. ఈ రెండు జట్లు ఆఖరి మ్యాచ్‌ల్లో గెలిస్తే... పాయింట్ల పట్టిక తారుమారు అవుతుంది.. 

click me!

Recommended Stories