ఉప్పల్‌లో ఆర్సీబీకి కష్టాలే.. చరిత్ర చెబుతున్న సత్యమిదే..

Published : May 18, 2023, 07:18 PM IST

IPL 2023, SRH vs RCB: ఐపీఎల్ - 16 లో ఆర్సీబీ నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక మ్యాచ్ ఆడుతున్నది.  ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చరిత్ర చూస్తే ఆర్సీబీకి ఆందోళన తప్పదు. 

PREV
18
ఉప్పల్‌లో  ఆర్సీబీకి  కష్టాలే.. చరిత్ర చెబుతున్న సత్యమిదే..

ఐపీఎల్ - 16లో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.  ఉప్పల్ వేదకిగా  సన్ రైజర్స్ హైదరాబాద్ తో  మ్యాచ్ ఆడుతున్నది.  అయితే ఉప్పల్ లో   ఆర్సీబీకి  చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ లో భాగంగా 2013 నుంచి ఇక్కడ ఆడిన  గత ఏడు మ్యాచ్ లలో  ఆర్సీబీ గెలిచింది ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్.   2015లో తప్ప   మిగిలిన ఆరు సార్లూ సన్ రైజర్స్ దే విజయం. 

28

ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య   ఉప్పల్ వేదికగా 2013లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో  ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.  అనంతరం హైదరాబాద్ కూడా  20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  130 పరుగులే చేసింది. సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఫలితంలో హైదరాబాద్ నే విజయం వరించింది. 

38

2014 సీజన్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  ఆర్సీబీ.. 160 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని  సన్ రైజర్స్ హైదరాబాద్.. 19.4 ఓవర్లలోనే ఛేదించింది.  శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ లు హాఫ్ సెంచరీలతో రాణించారు. 

48

2015 లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్  లో  సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి  11 ఓవర్లలోనే  3 వికెట్ల నష్టానికి  135 పరుగులు చేసింది.  వర్షం కారణంగా లక్ష్యాన్ని 82 కుదించగా.. ఆర్సీబీ.. 5.5 ఓవర్లలోనే అందుకుంది. కోహ్లీ.. 19 బంతుల్లోనే  3 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో   44 పరుగులు చేశాడు. 

58

2016లో  జరిగిన మ్యాచ్  లో సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్.. 50 బంతుల్లోనే  92 పరుగులు చేశాడు.  కేన్ మామ హాఫ్  సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 20 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి  179 పరుగులే చేసింది. ఫలితంగా  హైదరాబాద్.. 15 పరుగుల తేడాతో గెలుపొందింది. 

68

2017 లో సన్ రైజర్స్ మొదలు బ్యాటింగ్ చేసి  20 ఓవర్లలో  4 వికెట్లు కోల్పోయి  207 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో  172 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో  హైదరాబాద్.. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 

78

2018లో   భాగంగా సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి  146 పరుగులకే ఆలౌట్ అయింది. సౌథీ, సిరాజ్ లు  తలా మూడు వికెట్లతో చెలరేగారు. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 20 ఓవర్లలో  141 పరుగులు  మాతమ్రే  చేయగలిగింది.  దీంతో హైదరాబాద్.. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. 

88

ఇక 2019లో   హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్ ను సన్ రైజర్స్ అభిమానులు మరిచిపోరు.  ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో  రెండు వికెట్లు కోల్పోయి  231 పరుగులు చేసింది.   బెయిర్ స్టో  (114), వార్నర్ (100) లు సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఆర్సీబీ..  19.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది.  హైదరాబాద్.. 118 పరుగుల తేడాతో గెలుపొందింది. 

click me!

Recommended Stories