కోహ్లీ నహీ! కింగ్ కోహ్లీ బోలో... ఐపీఎల్‌లో ఆరో సెంచరీతో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ...

Published : May 19, 2023, 09:25 AM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసిన్ సెంచరీతో చెలరేగగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ తరుపున సెంచరీ బాదాడు...

PREV
17
కోహ్లీ నహీ! కింగ్ కోహ్లీ బోలో... ఐపీఎల్‌లో ఆరో సెంచరీతో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ...
Image credit: PTI

తొలి వికెట్‌కి ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది ఆరో సెంచరీ...
 

27

ఆర్‌సీబీ మాజీ ప్లేయర్, విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్... ఐపీఎల్‌లో 6 సెంచరీలు బాది టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అతని రికార్డును సమం చేశాడు....
 

37
Kohli-Du Plessis

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వన్డేల్లో మూడు సెంచరీలు, టెస్టుల్లో సెంచరీ అందుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా సెంచరీతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చేశాడు...
 

47
PTI Photo/Kunal Patil)(PTI05_08_2023_000296B)

2015లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి, ఆర్‌సీబీని గెలిపించాడు. మళ్లీ 8 ఏళ్లకు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచింది ఆర్‌సీబీ. ఈ రెండు సందర్భాల్లో విరాట్ కోహ్లీయే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవడం విశేషం...

57

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి ఈ సీజన్‌లో 800 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2016లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి 939 పరుగులు చేశారు. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి ఈ ఇద్దరూ కలిసి మరో 140 పరుగులు జోడిస్తే చాలు...
 

67
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000409B)

ఆర్‌సీబీ తరుపున అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన మూడో బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఏబీ డివిల్లియర్స్ 23 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిస్తే, క్రిస్ గేల్ 17 సార్లు గెలిచాడు.

77

16వ సారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఈ అవార్డు గెలిచిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories