ఐపీఎల్ 2023: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తొలి సీజన్ ప్లేయర్లు ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడున్నారు...

Published : Apr 21, 2023, 02:02 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడినా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హారీ బ్రూక్ సెంచరీ చేసి, అదరగొట్టాడు... 

PREV
118
ఐపీఎల్ 2023: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తొలి సీజన్ ప్లేయర్లు ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడున్నారు...

హరీ బ్రూక్ సెంచరీ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీమ్ లోగోను పోస్ట్ చేశాడు.  డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్టే.. మరి మొదటి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌ హైదరాబాద్ టీమ్‌కి ఆడిన ప్లేయర్లు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమయ్యారు...

218

షాహిద్ ఆఫ్రిదీ: ఐపీఎల్ 2008 సీజన్‌లో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీమ్ తరుపున ఆడాడు. 10 మ్యాచుల్లో 81 పరుగులే చేసిన ఆఫ్రిదీ, బ్యాటర్‌గా ఫెయిల్ అయినా బౌలింగ్‌లో 9 వికెట్లు తీసి  పర్వాలేదనిపించాడు. 2008 తర్వాత పాక్ ప్లేయర్లపై ఐపీఎల్‌లో నిషేధం పడడంతో ఆఫ్రిదీ... ఒకే సీజన్‌కి పరిమితమయ్యాడు.. 
 

318

సంజయ్ బంగర్: భారత ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 11 మ్యాచులు ఆడాడు. 7 మ్యాచుల్లో 47 పరుగులే చేసిన సంజయ్ బంగర్, బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, కొచ్చి టస్కర్స్, పంజాబ్ కింగ్స్‌కి  కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్,  ప్రస్తుతం భారత క్రికెట్ టీమ్‌కి బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు...

418

హల్‌హదర్ దాస్: ఒడిశా రాష్ట్రానికి చెందిన హల్‌హదర్ దాస్ గురించి నేటి ఐపీఎల్ ఫ్యాన్స్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన హల్‌హదర్ దాస్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఆడమ్ గిల్‌క్రిస్ట్ వికెట్ కీపర్‌గా ఉండడంతో భారత వికెట్ కీపర్ హల్‌హదర్‌కి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 32 ఏళ్ల హల్‌హదర్ దాస్, ఒడిస్పా టీమ్‌లో కూడా చోటు కోల్పోయి.. క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికే స్టేజీలో ఉన్నాడు..

518

డొడ్డపనేని కళ్యాణకృష్ణ: స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ మ్యాచులు చూసే ఫ్యాన్స్‌కి ఈ పేరు చాలా సుపరిచితమే. ఐపీఎల్‌ 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడిన కళ్యాణ్‌కృష్ణ, 3 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీశాడు. కుమార సంగర్కర, యూసఫ్ పఠాన్‌లను అవుట్ చేసిన కళ్యాణ్, బ్యాటింగ్‌లో మాత్రం 3 పరుగులే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆంధ్ర టీమ్‌కి బౌలింగ్ కోచ్‌గా ఉన్న కళ్యాణ్‌కృష్ణ, క్రికెట్ కామెంటేటర్‌గానూ సక్సెస్ అయ్యాడు..

618

డేవిడ్ పైడికల్వ విజయ్‌కుమార్: పోర్టర్‌గా రూ.70 కోసం కూలీ పని చేస్తూ జీవనం సాగించిన డేవిడ్ పైడికల్వ విజయ్‌కుమార్ జీవితాన్ని, ఐపీఎల్ మార్చేసింది. రూ.60 లక్షలకు డెక్కన్ ఛార్జర్స్‌ హైదరాబాద్‌‌లోకి వచ్చిన డేవిడ్ పైడికల్వ విజయ్‌కుమార్ 9 మ్యాచుల్లో 4 వికెట్లు తీశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా విజయ్‌కుమార్‌కి బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. 2008 తర్వాత ఐపీఎల్ ఆడని విజయ్ కుమార్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 వికెట్లు తీశాడు. 32 ఏళ్ల వయసులో డేవిడ్, మళ్లీ ఐపీఎల్‌లోకి రావాలని ఆశపడుతున్నాడు...

718
chaminda vaas

ఛమర సిల్వ:2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు ఆడారు. ఛమర సిల్వ, ఛమిందా వాస్, నువాన్ జోసా. 3 మ్యాచులు ఆడ 43 పరుగులు చేసిన ఛమర సిల్వ, 2017లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురయ్యాడు...

3 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీసిన లంక బౌలర్ నువాన్ జోసా, ఆ తర్వాత ఐపీఎల్‌లో కనిపించలేదు. లంక టీమ్‌ని ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన నువాన్ జోసా, అవినీతి ఆరోపణలతో విధుల నుంచి తప్పుకున్నాడు..

ఐపీఎల్ 2008 నుంచి 2010 వరకూ మూడు సీజన్లు ఆడిన ఛమిందా వాస్, 13 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. శ్రీలంక, ఐర్లాండ్ వంటి టీమ్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు ఛమిందా వాస్..
 

818

అర్జున్ యాదవ్: మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో 2000 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడు అర్జున్ యాదవ్. 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడిన అర్జున్, 8 మ్యాచుల్లో 49 పరుగులే చేశాడు. 2012 తర్వాత హైదరాబాద్ టీమ్‌కి దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన అర్జున్ యాదవ్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శివ్‌పాల్ యాదవ్ కుమారుడు కూడా...

918

స్కాట్ సైరిస్: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ సైరిస్ కూడా డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 2 సీజన్లు ఆడాడు. మొదటి సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన డెక్కన్ ఛార్జర్స్, 112 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా మారిన స్కాట్ సైరిస్, అక్కడ మంచి సక్సెస్ సాధించాడు..

1018

ఆడమ్ గిల్‌క్రిస్ట్: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. 2008లో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, హైదరాబాద్ టీమ్ తరుపున సెంచరీ చేసిన తొలి బ్యాటర్. హైదరాబాద్ తరుపున పంజాబ్ కింగ్స్‌కి ఆడిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, ప్రస్తుతం కామెంటేటర్‌గా మారాడు..

1118

రోహిత్ శర్మ: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌లో 46 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 3 సీజన్లలో కలిపి 1219 పరుగులు చేశాడు.  మొదటి సీజన్‌లో 404 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆ తర్వాతి సీజన్‌లో రోహిత్‌కి హ్యాట్రిక్ కూడా దక్కింది... హైదరాబాద్ నుంచి ముంబై ఇండియన్స్‌కి మారిన రోహిత్ శర్మ, ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి, టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు..

1218

ద్వారక రవితేజ: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 2008 నుంచి 2012 వరకూ ఆడిన ప్లేయర్లలో ద్వారక రవితేజ కూడా ఒకడు. 30 మ్యాచులు ఆడిన రవితేజ, 361 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఒకే ఒక్క వికెట్ తీసిన రవితేజ, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కూడా చేరినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రవితేజ కూడా కామెంటేటర్‌గా బిజీగా ఉన్నాడు..

1318

ఆర్‌పీ సింగ్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆర్‌పీ సింగ్, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 3 సీజన్లు ఆడాడు. 2009లో పర్పుల్ క్యాప్ గెలిచిన ఆర్‌పీ సింగ్, మొదటి సీజన్2లో 15 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, కొచ్చి టస్కర్స్, పూణే సూపర్ జెయింట్స్ టీమ్‌కి ఆడిన ఆర్‌పీ సింగ్, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు..

1418

ఆండ్రూ సైమండ్స్: ఆసీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్, 3 సీజన్ల పాటు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 117 పరుగులు చేసి సెంచరీ అందుకున్న సైమండ్స్, విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. బౌలింగ్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిన సైమండ్స్, 14.78 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. ఈ ఏడాది ఆండ్రూ సైమండ్స్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే..

1518

వీవీఎస్ లక్ష్మణ్: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి మొదటి కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్. హైదరాబాదీ ప్లేయర్ కావడంతో డెక్కన్ ఛార్జర్స్‌కి కెప్టెన్సీ చేసిన వీవీఎస్, మొదటి సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మొత్తంగా 3 సీజన్లలో కలిపి 19 మ్యాచుల్లో 228 పరుగులే చేసిన వీవీఎస్ లక్ష్మణ్, 2010 తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ టీమ్‌కి ఆడాడు. ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు..

1618
cricketer venugopal rao

వేణుగోపాల రావు: టీమిండియాకి ఆడిన ఆంధ్రా ప్లేయర్లలో వేణుగోపాల రావు ఒకడు. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 3 సీజన్లలో కలిపి 35 మ్యాచులు ఆడిన వేణుగోపాల రావు, 498 పరుగులు చేశాడు. అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వేణుగోపాల రావు, ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన వేణు, రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నాడు.

1718
Rohit Sharma and Pragyan Ojha

ప్రజ్ఞాన్ ఓజా: డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. మొత్తంగా 3 సీజన్లలో 62 వికెట్లు తీసిన ప్రజ్ఞాన్ ఓజా, 2010 సీజన్‌లో పర్పుల్ క్యాప్ కూడా గెలిచాడు. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ నుంచి ముంబై ఇండియన్స్‌కి మారిన ప్రజ్ఞాన్ ఓజా, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్నాడు.  

1818

సర్వేశ్ కుమార్: మొట్టమొదటి సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన ప్లేయర్లలో తెలుగు ఆటగాడు సర్వేశ్ కుమార్ ఒకడు. అయితే డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున 2 మ్యాచులు ఆడిన సర్వేశ్ 1 పరుగు, 1 వికెట్ మాత్రమే తీసి టీమ్‌లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం సర్వేశ్ క్రికెట్‌కి దూరమై, ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. 

click me!

Recommended Stories