వృద్ధిమాన్ సాహా టైమ్ ఏం బాగున్నట్టు లేదే... బెంగాల్ క్రికెట్ బోర్డు అధికారితో గొడవ పడి...

First Published May 18, 2022, 4:41 PM IST

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున అదరగొడుతున్న సాహా... క్రికెట్ లైఫ్‌లో ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు...

ఎమ్మెస్ ధోనీ కారణంగా వృద్ధిమాన్ సాహా చాలా మ్యాచుల్లో సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గానే మిగిలిపోయాడు. టీమ్‌లోనే ఉన్నా, తుదిజట్టులో అవకాశం దొరికిన సందర్భాలు చాలా తక్కువ...

ఎమ్మెస్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతూ వచ్చిన సాహా, ఆస్ట్రేలియా టూర్ 2020లో రిషబ్ పంత్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆ పొజిషన్‌ని కూడా కోల్పోయాడు...

Latest Videos


Wriddhiman Saha

2020-22 సీజన్‌లో వృద్ధిమాన్ సాహా ఆడింది రెండే రెండు మ్యాచులు. అది కూడా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వడంతో సాహాకి తుదిజట్టులో అవకాశం దక్కింది...

అయినా పర్లేదు, టీమ్‌లో ఉన్నా కదా... అని సరిపెట్టుకుంటూ వచ్చిన వృద్ధిమాన్ సాహా, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కకపోయే సరికి ఆశ్చర్యపోయాడు...

Wriddhiman Saha

టీమ్‌లో తనకి ఎప్పుడూ చోటు ఉంటుందని మాట ఇచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇప్పుడు మాట తప్పారని... న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసినా కూడా తనని ఎందుకు తప్పించారో తెలియడం లేదని కామెంట్లు చేశాడు వృద్ధిమాన్ సాహా...

వృద్ధిమాన్ సాహాతో పాటు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్ టెస్టు ప్లేయర్లను లంకతో సిరీస్‌కి ఎంపిక చేయని బీసీసీఐ, వారిని రంజీ ట్రోఫీలో పాల్గొని ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా కోరింది...

అయితే వ్యక్తిగత కారణాలతో రంజీ ట్రోఫీ ఫస్టాఫ్‌లో ఆడడానికి ఇష్టపడలేదు వృద్ధిమాన్ సాహా. ఇదే ఇప్పుడు అతనికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది...

తాజాగా బెంగాల్ క్రికెట్ బోర్డు, జార్ఖండ్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రకటించిన జట్టులో వృద్ధిమాన్ సాహాకి కూడా చోటు కల్పించింది. అయితే సాహా మాత్రం బెంగాల్ టీమ్ నుంచి బయటికి రావడానికి ఎన్‌ఓసీ కోరి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు...

బెంగాల్ క్రికెట్ బోర్డు జాయింట్ సెక్రటరీ దేవద్రతా దాస్‌తో వృద్ధిమాన్ సాహాకి గొడవ జరిగింది. సాహా కమిట్‌మెంట్‌ను దేవద్రతా ప్రశ్నించాడు. దీనికి నొచ్చుకున్న సాహా, పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు...

జాయింట్ సెక్రటరీతో గొడవతో బెంగాల్ క్రికెట్ బోర్డు నుంచి బయటికి వచ్చేందుకు CAB (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియాని కలిసి, ఎన్‌వోసీ కోరాడు... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచుల్లో 281 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, బెంగాల్ తరుపున 111 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 43.07 సగటుతో 5551 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో పాటు వికెట్ కీపర్‌గా 299 క్యాచులు ఉన్నాయి...

click me!