Published : Feb 03, 2022, 01:25 PM ISTUpdated : Feb 03, 2022, 07:25 PM IST
BCCI Chief Confirms IPL 2022 Venues: క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 ఎక్కడ జరుగుతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2022 ఎక్కడ జరుగుతుంది..? దేశంలో కరోనా ఉదృతి నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ను గత రెండు సీజన్ల మాదిరిగానే దుబాయ్ లో నిర్వహిస్తారని గతంలో వార్తలు వినిపించాయి.
28
దుబాయ్ కంటే తమ దేశంలో ఖర్చులు తక్కువని, తమదగ్గర ఐపీఎల్ నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ప్రతిపాదనలు పంపింది.
38
కాగా మరోవైపు ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహించాలని టీమిండియా అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐని కోరారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పలు ఛానెళ్లు కథనాలను ప్రసారం చేశాయి.
48
దీనిపై బీసీసీఐ ఇంతవరకూ స్పందించలేదు. కానీ తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తదుపరి ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందని స్పష్టం చేశాడు. ఈ మేరకు వేదికలను కూడా ప్రకటించాడు.
58
ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో గంగూలీ మాట్లాడుతూ.. ‘కరోనా పరిస్థితి చేయిదాటిపోతే తప్ప ఈసారి ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తాం. గతంలో మేము స్పష్టం చేసిన మాదిరిగానే భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.
68
మహారాష్ట్ర లోని ముంబై, పూణెలలో మ్యాచులను నిర్వహించాలని భావిస్తున్నాం. లీగ్ మ్యాచులైతే ఇక్కడే నిర్వహిస్తాం. అహ్మదాబాద్ గురించి ఇంకా ఆలోచించలేదు. ఒకవేళ ఏప్రిల్-మేలలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటి పరిస్థితుల ఆధారంగా దానిమీద నిర్ణయం తీసుకుంటాం..’ అని గంగూలీ చెప్పాడు.
78
లీగ్ మ్యాచులను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల స్టేడియాలలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మూడు స్టేడియాలతో పాటు పూణె లో కూడా ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నారు
88
ఇక ప్లే ఆఫ్స్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని గతంలో అనుకున్నా.. తాజాగా గంగూలీ వ్యాఖ్యలు చూస్తే మాత్రం బీసీసీఐ అందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతున్నది.