జడేజా చేతకాలేదు, మరి సీఎస్‌కే నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్‌తో...

First Published May 5, 2022, 2:45 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి వింత అనుభవాన్ని మిగిల్చింది. ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచుల్లో ఓడగా, డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో సీజన్‌ని ఆరంభించిన సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలు కూడా గల్లంతయ్యాయి...

10 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుని, 7 ఓటములను చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. మిగిలిన మ్యాచుల్లో ఘన విజయాలు అందుకోవడంతో పాటు వేరే జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది...
 

అయితే సీఎస్‌కేకి పర్ఫామెన్స్‌తో పాటు కెప్టెన్సీ సమస్య కూడా వెంటాడుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా, కెప్టెన్సీ భారాన్ని మోయలేక సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు...

Latest Videos


ఇన్నాళ్లు ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు తీసుకుంటారని భావించారు చెన్నై ఫ్యాన్స్. ఇప్పుడు జడేజా, ఆ ఆప్షన్‌ని దాదాపు తుడిచి పెట్టేశాడు...

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు బౌలర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు జడేజా. ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించే జడ్డూ, చేతుల్లోకి వచ్చిన క్యాచులను కూడా నేలపాలు చేయడం చూస్తే కెప్టెన్సీ ప్రెషర్, అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవచ్చు...
 

ఎమ్మెస్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్.. అనేది తేలిపోయింది. మరి వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు? ఇప్పుడు సీఎస్‌కే ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే..

సీనియర్ సిటిజన్స్ హోమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీఎస్‌కేలో ఇప్పుడు అంబటి రాయుడు, డీజే బ్రావో, రాబిన్ ఊతప్ప వంటి ప్లేయర్లు... రిటైర్మెంట్‌కి చాలా దగ్గర్లో ఉన్నవాళ్లే. వారిని ఫ్యూచర్ కెప్టెన్లుగా చూడలేం...

ఇక రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహార్ వంటి ప్లేయర్లకు అంతర్జాతీయ అనుభవం చాలా తక్కువ. వారిని సీఎస్‌కే కెప్టెన్లుగా ఇప్పుడే గుర్తించలేని పరిస్థితి... 

Image Credit: Getty Images (File Photo)

దీంతో వచ్చే సీజన్‌లో సరైన ప్లేయర్ మినీ వేలంలో దొరకకపోతే చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జడేజా, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లవైపు చూడాల్సిన పరిస్థితి రావచ్చు.. 

click me!