ఈ పిల్ల చాలా తెలివైంది, అందుకే ఆర్‌సీబీ ఫ్యాన్‌ని... ఐపీఎల్ లైవ్ ప్రపోజల్‌పై వసీం జాఫర్ ట్వీట్ వైరల్...

Published : May 05, 2022, 12:57 PM IST

రెండు సీజన్ల తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌ ద్వారా ఇండియాలో మళ్లీ స్టేడియంలో ప్రేక్షకులకు మ్యాచులు చూసేందుకు అనుమతి దక్కింది. సగం సీజన్ ముగిసిందో లేదో ఈసారి స్టేడియంలో కొన్ని రొమాంటిక్ సీన్స్, అటు లైవ్ మ్యాచ్ చూసే ప్రేక్షకులను, టీవీల్లో లైవ్ చూసే ఆడియెన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేశాయి...

PREV
18
ఈ పిల్ల చాలా తెలివైంది, అందుకే ఆర్‌సీబీ ఫ్యాన్‌ని... ఐపీఎల్ లైవ్ ప్రపోజల్‌పై వసీం జాఫర్ ట్వీట్ వైరల్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఓ జంట... చుట్టూ ఉన్న జనాన్ని, కెమెరాలను మరిచిపోయి ముద్దుల్లో తేలిపోవడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

28

ఆ సంఘటన మరవకముందే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అమ్మాయి, ఆర్‌సీబీ సపోర్టర్‌ అయిన తన  బాయ్‌ఫ్రెండ్‌కి అందరి ముందు ప్రపోజ్ చేసింది ఓ అమ్మాయి...

38

సాధారణంగా అబ్బాయిలు మోకాళ్ల మీద కూర్చొని అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. అయితే ఆర్‌సీబీ ఫ్యాన్ గర్ల్ మాత్రం తానే మోకాళ్ల మీద కూర్చొని, తన బాయ్‌ఫ్రెండ్‌కి రింగ్‌తో ప్రపోజ్ చేసి... అందరి హృదయాలు కొల్లగొట్టింది...

48

ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, తనదైన స్టైల్‌లో స్పందించాడు... ‘స్మార్ట్ గర్ల్, ఓ ఆర్‌సీబీ ఫ్యాన్‌కి ప్రపోజ్ చేస్తోంది. అతను ఆర్‌సీబీకి విశ్వాసంగా నిజాయితీగా ఉంటే, తన పార్టనర్‌తోనూ అంతే నిజాయితీగా ఉంటాడు...’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్.. 

58

14 సీజన్లుగా ఆర్‌సీబీ, ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని నమ్ముతూ, నిరాశపడుతూ... అయినా తమ టీమ్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ వస్తున్నారు అభిమానులు...

68

‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ ఫ్యాన్స్ సందడి చేయడం, టోర్నీ మొదలయ్యాక తమ టీమ్ పర్ఫామెన్స్‌తో డిస్సప్పాయింట్ కావడం, అయినా కోహ్లీ టీమ్‌కే సపోర్ట్‌ చేయడం కొన్ని సీజన్లుగా ఆనవాయితీగా వస్తోంది...

78

ప్రతీసారీ తమ ఫెవరెట్ టీమ్ టైటిల్ గెలుస్తుందని ఆశపడడం, ఎన్నిసార్లు తీవ్రంగా నిరాశపరిచినా... మరో టీమ్‌కి మద్ధతు తెలపకుండా అదే జట్టును అభిమానించే ఫ్యాన్స్... కేవలం ఆర్‌సీబీ మాత్రమే ఉంటారంటారు క్రికెట్ విశ్లేషకులు.. 
 

88

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 68 పరుగులకి ఆలౌట్ అయ్యి, చిత్తుగా ఓడిన తర్వాత కూడా స్టేడియంలో ప్రేక్షకులు... ‘ఆర్‌సీబీ... ఆర్‌సీబీ’ అని అరుస్తూ సపోర్ట్ చేయడం, ఆ సంఘటనను చూసి విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.

click me!

Recommended Stories