ఏం పర్లేదు, ఆ ఒక్క పని చెయ్! రిజల్డ్ ఎలా ఉంటుందో చూడు... విరాట్ కోహ్లీకి విటోరీ సలహా...

Published : Apr 29, 2022, 11:35 AM IST

గత దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు సాధించి, ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు గెలుచుకున్న విరాట్ కోహ్లీ... ఇప్పుడు కెరీర్‌లో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతూ వస్తోంది...

PREV
17
ఏం పర్లేదు, ఆ ఒక్క పని చెయ్! రిజల్డ్ ఎలా ఉంటుందో చూడు... విరాట్ కోహ్లీకి విటోరీ సలహా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ... 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 బంతులాడి 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు విరాట్...

27

145 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ వికెట్లను త్వరత్వరగా కోల్పోయిన ఆర్‌సీబీ, 115 పరుగులకి ఆలౌట్ అయ్యి 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది...
 

37

‘విరాట్ కోహ్లీ తనను తాను తెలుసుకోవడానికి, తన మెంటల్ స్ట్రెంగ్త్‌ని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు నీ మనసులో మెదులుతున్న ఆలోచనలను, కోపాన్ని, ఆవేశాన్ని అన్నింటినీ పక్కనబెట్టి... కేవలం నీ సత్తాను నమ్మి బ్యాటింగ్ చేయాలి...

47

విరాట్ కోహ్లీ ఆడుతున్న విధానం చూస్తుంటే, అతను ఏదో విషయం గురించి లేదా ఏదో ఇన్నింగ్స్ గురించి ఆలోచిస్తూ... దాని నుంచి బయటికి రాలేకపోతున్నట్టు అర్థం అవుతోంది...

57

ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరూ విరాట్ కోహ్లీ బాగా ఆడితే ఇంకా బాగా రాణించగలుగుతారు. విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ వీరిని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్టుంది. అయినా పర్లేదు, విరాట్ స్టెప్ అవుట్ అయి ఆడితే మొమెంటమ్ అందుకోగలడు...

67

విరాట్ కోహ్లీ క్రీజు ముందుకొచ్చి ఆడే షాట్స్ చాలా నమ్మకంగా ఆడగలడు. ఇలా స్టెప్ అవుట్ అయితే బౌలర్లపై ప్రెషర్ పెంచగలడు. ఇప్పుడు విరాట్ మోస్తున్న ప్రెషర్ తొలగించుకోవాలంటే ఇదే పరిష్కారం...

77
Virat Kohli

విరాట్ కోహ్లీ బలం అగ్రెసివ్ బ్యాటింగ్. అదే దూకుడు అతనిలో ఇప్పుడు కనిపించడం లేదు. ఫామ్‌లోకి రావాలంటే మళ్లీ ఆ అగ్రెసివ్ యాటిట్యూడ్‌ని బయటికి తీస్తే చాలు...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ డానియల్ విటోరి...

Read more Photos on
click me!

Recommended Stories