2021లో అతనే లేపాడు, ఇప్పుడు అతనే పడేస్తున్నాడు... కేకేఆర్‌కి భారంగా వెంకటేశ్ అయ్యర్...

Published : Apr 28, 2022, 08:17 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చి, క్రికెట్ ఫ్యాన్స్‌ని, ఎక్స్‌పర్ట్స్‌ని మెప్పించిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. ఫస్టాఫ్‌లో కేవలం 2 మ్యాచులు మాత్రమే గెలిచి, ప్లేఆఫ్స్ చేరడం కష్టమని ఫిక్స్ అయిన కేకేఆర్ కథ మార్చిన యోధుడు వెంకటేశ్ అయ్యరే... ఈసారి మాత్రం హీరో కాస్తా విలన్‌గా మారాడు.

PREV
110
2021లో అతనే లేపాడు, ఇప్పుడు అతనే పడేస్తున్నాడు... కేకేఆర్‌కి భారంగా వెంకటేశ్ అయ్యర్...
venkatesh Iyer

10 ఇన్నింగ్స్‌ల్లో 128.47 స్ట్రైయిక్ రేటుతో 41.11 యావరేజ్‌తో 370 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు.

210

ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా వెంకటేశ్ అయ్యర్‌కి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ఫెయిల్ అయినా టీ20ల్లో బాగానే రాణించాడు ఈ మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్...
 

310

గత సీజన్ పర్ఫామెన్స్ కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ సీజన్‌లో అయ్యర్ అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్‌తో కేకేఆర్ పరాజయాలకు ప్రధాన కారణమవుతున్నాడు...

410

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యావరేజ్ 14.6 మాత్రమే. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో చేసిన 50 పరుగులు తీసి వేస్తే... మిగిలిన 8 మ్యాచుల్లో కలిపి అయ్యర్ చేసింది 82 పరుగులు మాత్రమే.

510

గత సీజన్‌లో మొదటి బంతి నుంచి బౌలర్లపై విరుచుకుపడిన వెంకటేశ్ అయ్యర్, ఈసారి మాత్రం మునుపటిలా ఆత్మవిశ్వాసంగా ఇన్నింగ్స్ మొదలెట్టలేకపోతున్నాడు.. తన స్టైల్‌లో బౌండరీలు బాదడానికి బదులుగా కుదురుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు...

610
Venkatesh Iyer

గత సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ ఆటలో కనిపించిన కాన్ఫిడెన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ ప్రస్తుత సీజన్‌లో అతనిలో కనిపించడం లేదు. ఇదే కేకేఆర్‌కి ఇబ్బందిగా మారింది...

710

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులు రావాల్సిన చోట సింగిల్ మాత్రమే తీసి స్ట్రైయిక్ ఉంచుకున్నాడు వెంకటేశ్ అయ్యర్. ఇది ఆ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ తర్వాతి ఓవర్‌లో 4 వికెట్లు తీసి హ్యాట్రిక్‌తో కోల్‌కత్తాకి విజయాన్ని దూరం చేశాడు చాహాల్..
 

810
venkatesh Iyer, Hardik Pandya

గత సీజన్‌లో ఫెయిల్ అయిన హార్ధిక్ పాండ్యా ఈసారి కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుంటే... వెంకటేశ్ అయ్యర్ మాత్రం టీమిండియా ఎంట్రీ తర్వాత ఉన్న నమ్మకాన్ని కాస్తా కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు.

910

వెంకటేశ్ అయ్యర్‌కి తోడు సరైన ఓపెనర్‌ దొరకకపోవడం, సునీల్ నరైన్, నితీశ్ రాణా బ్యాటుతో మెప్పించకపోవడంతో పాటు గత సీజన్‌లో కేకేఆర్‌‌కి బలంగా మారిన వరుణ్ చక్రవర్తి ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ కావడంతో... శ్రేయాస్ అయ్యర్ టీమ్ పెద్దగా విజయాలు అందుకోలేకపోతోంది...

1010

కేకేఆర్‌ని ఐపీఎల్ టైటిల్ అందించి, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో మంచి మార్కులు కొట్టేయాలని చూసిన శ్రేయాస్ అయ్యర్‌కి కోల్‌కత్తా ప్లేయర్లు పెద్ద షాకే ఇస్తున్నారు. 

click me!

Recommended Stories