ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో వెలుగులోకి వచ్చిన యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. ఐపీఎల్‌లో రెండేళ్లుగా బౌలింగ్ చేయలేక, పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న హార్ధిక్ పాండ్యా ప్లేస్‌కే ఎసరు పెట్టేలా కనిపించాడు వెంకటేశ్ అయ్యర్...
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్, ఇప్పటికే 2 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు. 9 టీ20 మ్యాచుల్లో 133 పరుగులు చేసిన అయ్యర్, 5 వికెట్లు కూడా తీశాడు...
211
వెంకటేశ్ అయ్యర్‌కి తుదిజట్టులో అవకాశం ఇచ్చినా... అతన్ని కరెక్టుగా వాడుకునే ప్రయత్నం చేయలేదు టీమిండియా సారథి రోహిత్ శర్మ, తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్...
311
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాణించిన అయ్యర్‌ని, టీమిండియాకి ఫినిషర్‌గా ఏడో స్థానంలో, 8వ స్థానంలో బ్యాటింగ్‌కి పంపారు. అలాగే బౌలింగ్ వేయించిన మ్యాచులు కూడా తక్కువే...
411
హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్ భారత జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైంది...
511
వెన్ను గాయంతో బౌలింగ్ చేయలేక, పేలవ ఫామ్‌తో భారత జట్టుకి దూరమైన హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు...
611
5 మ్యాచుల్లో 76 సగటుతో 136+ స్ట్రైయిక్ రేటుతో 228 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, రెండు హాఫ్ సెంచరీలు చేసి... మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు...
711
గత సీజన్‌లో 12 మ్యాచులు ఆడి 127 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఈ సీజన్‌లో 5 మ్యాచుల్లో 228 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీశాడు... రనౌట్లు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలు బోనస్..
811
మొదటి మ్యాచ్‌లో 37 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాతి మ్యాచుల్లో బౌలింగ్‌లోనూ బెటర్ పర్పామెన్స్ ఇస్తూ... తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే దిశగా సాగుతున్నాడు.
911
venkatesh Iyer
మరో వైపు ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా వెంకటేశ్ అయ్యర్ నుంచి ‘వారెవా!’ అనిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదు. ఐపీఎల్ 2022లో ఇప్పటిదాకా 16, 10, 3, 50, 18, 6 పరుగులు చేసి నిరాశపరిచాడు అయ్యర్...
1011
ఒక్క మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినా, అది చేయడానికి 41 బంతులు తీసుకున్నాడు వెంకటేశ్ అయ్యర్. కేకేఆర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా అయ్యర్ ఫామ్...
1111
ఇది ఇలాగే కొనసాగితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హార్ధిక్ పాండ్యాకి భారత జట్టులో చోటు దక్కడం ఖాయం. వెంకటేశ్ అయ్యర్‌కి చోటు దక్కినా, రిజర్వు ప్లేయర్‌గానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...