నన్ను వదిలేసినవారికి నేనేంటో చూపించా... కేకేఆర్‌పై రాహుల్ త్రిపాఠి కామెంట్...

Published : Apr 16, 2022, 03:19 PM IST

ఐపీఎల్‌లో ప్రతీ సీజన్‌కి తన పర్ఫామెన్స్‌లో ఇంప్రూమెంట్ చూపిస్తున్న బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 1500+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన రాహుల్ త్రిపాఠి, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తఢాఖా చూపించాడు...

PREV
19
నన్ను వదిలేసినవారికి నేనేంటో చూపించా... కేకేఆర్‌పై రాహుల్ త్రిపాఠి కామెంట్...

2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్ల తరుపున ఆడాడు...

29

రాహుల్ త్రిపాఠి కోసం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తీవ్రంగా పోటీపడినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది... 

39

కేకేఆర్‌ నుంచి బయటికి వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇరగదీసే పర్ఫామెన్స్ ఇచ్చాడు. తనను వదిలేసిన వారికి తనేంటో చూపించాడు.

49

176 పరుగుల లక్ష్యఛేదనలో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్... ఈ దశలో అయిడిన్ మార్క్‌రమ్‌తో కలిసి మూడో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్ త్రిపాఠి, 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు..

59

త్రిపాఠి అవుటైన తర్వాత అయిడిన్ మార్క్‌రమ్ తన దూకుడు కొనసాగించడంతో 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...

69

‘నేను ఈ రోజు బ్యాటింగ్‌ని బాగా ఎంజాయ్ చేశా. కేకేఆర్‌తో గడిపిన క్షణాలు చాలా స్పెషల్. ఇప్పుడు అదే టీమ్‌పై మంచి ఇన్నింగ్స్ ఆడడం ఇంకా స్పెషల్... 

79

బ్యాటింగ్‌కి రావడానికి ముందు కాస్త ప్రెషర్‌కి లోనయ్యా. అయితే నేను ఆడిన ఇన్నింగ్స్ సంతృప్తినిచ్చింది.. కేకేఆర్ బౌలింగ్ గురించి నాకు బాగా క్లారిటీ ఉంది...

89

రస్సెల్, కొత్తగా క్రీజులోకి వచ్చిన వాళ్ల షార్ట్ బంతులు వేస్తాడు. అందుకే అతని బౌలింగ్‌లో వాటనే ఎదురుచూశా. వరుణ్ బాగా బౌలింగ్ చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి...

99

ఐపీఎల్ 2022 సీజన్‌లో 5 మ్యాచులు ఆడిన రాహుల్ త్రిపాఠి, 57 సగటుతో  178+ స్ట్రైయిక్ రేటుతో 171 పరుగులు చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు.

click me!

Recommended Stories