ఈసారి ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం పక్కా... - టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Published : Apr 16, 2022, 04:08 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. ఫేవరెట్లుగా బరిలో దిగిన జట్లు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిస్తే, అసలు ఏ మాత్రం అంచనాలు లేని గుజరాత్ టైటాన్స్ వంటి జట్లు టాప్‌లో దూసుకుపోతున్నాయి...

PREV
111
ఈసారి ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం పక్కా... - టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

యంగ్ కెప్టెన్లు, కొత్త సారథుల టీమ్స్ అయిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాయి...

211

సీనియర్లు రోహిత్ శర్మ, కేన్ విలియంసన్‌ల జట్లతో పాటు ఫోర్ టైం టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాయింట్ల పట్టికలో కింది వరుసలో ఉన్నాయి...

311

మొదట కెప్టెన్‌గా మెప్పించిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత వరుసగా పరాజయాలు అందుకుంటుంటే... అసలు కెప్టెన్‌గా పనికి వస్తాడా? అనుకున్న హార్ధిక్ పాండ్యా వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాడు...

411

అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం విరాట్ కోహ్లీ టీమ్ ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందని అంటున్నాడు... 

511

‘ఈ సీజన్‌లో కొత్త ఛాంపియన్‌ని చూడబోతున్నామని అనిపిస్తోంది. రాయల్ ఛాలంెజర్స్ బెంగళూరు, ఈ సీజన్‌లో బాగా ఆడుతోంది. వాళ్లు కచ్ఛితంగా ప్లేఆఫ్స్ చేరతారు...
 

611

టోర్నీ ముందుకు వెళ్లే కొద్ది వారి ఆటతీరు మరింత మెరుగవుతూ ఉంది. ఆర్‌సీబీలో మంచి ప్లేయర్లు ఉన్నారు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు... 

711

ప్రతీ మ్యాచ్‌కీ ఆర్‌సీబీలో పురోగతి కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీమ్‌లోకి వచ్చేశాడు. ఫాఫ్ డుప్లిసిస్ అదరగొడుతున్నాడు...

811

ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీ, ఆర్‌సీబీకి చాలా పెద్ద బోనస్‌గా మారింది. నా అంచనా ప్రకారం ఆర్‌సీబీ, టైటిల్ ఫెవరెట్ల లిస్టులో ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

911

వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌, ఆర్‌సీబీపై 23 పరుగుల తేడాతో గెలిచి సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది...

1011

అంతకుముందు పంజాబ్ కింగ్స్‌తోనూ ఓడిన ఆర్‌సీబీ లక్కీగా ప్లేఆఫ్స్ చేరినా టైటిల్ గెలవడం కష్టమే అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. 

1111

గత సీజన్లలోనూ ఆరంభంలో అదరగొట్టి, అభిమానుల్లో ఆశలు రేపిన ఆర్‌సీబీ..  ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్..

Read more Photos on
click me!

Recommended Stories