ఐపీఎల్‌లో నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు... యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్...

Published : May 07, 2022, 07:27 PM IST

ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ దక్కడానికి వెస్టిండీస్ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా ఓ కారణం. ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు బాదిన క్రిస్ గేల్, సిక్సర్లు బాదడంలో, అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు...

PREV
19
ఐపీఎల్‌లో నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు... యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్...

ఐపీఎల్ కెరీర్‌లో 142 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరుపున ఆడాడు... ఐపీఎల్‌లో 4965 పరుగులు చేసిన క్రిస్ గేల్, ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

29

ఐపీఎల్‌ కెరీర్‌లో 357 సిక్సర్లు బాది, 300+ సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న క్రిస్ గేల్, పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరుపున 175 పరుగులు చేసి... ఐపీఎల్‌లో హైయెస్ట్ స్కోరు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు...

39

2018 సీజన్‌లో ఆర్‌సీబీ నుంచి పంజాబ్ కింగ్స్‌కి మారిన క్రిస్ గేల్, 2020 సీజన్‌లో 7 మ్యాచులు మాత్రమే ఆడాడు. 2021 సీజన్‌లో 10 మ్యాచులు ఆడి, సెకండాఫ్‌ చివర్లో బయో బబుల్ కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

49

‘కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో నాకు సరైన దక్కలేదనే ఫీలింగ్ కలిగింది. ఇంత క్రికెట్ ఆడిన తర్వాత నీకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు రా గేల్... అని మనసులో నాకు నేనే చెప్పుకున్నా...

59

అందుకే రిటెన్షన్‌లో నా పేరు లేనప్పుడు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు, నిజానికి అది నేను ముందే ఊహించా... క్రికెట్ తర్వాత చాలా జీవితం ఉంది. దానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు క్రిస్ గేల్...

69

క్రిస్ గేల్, ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో గేల్, క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం గేల్ చేసిన వ్యాఖ్యలతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి...

79

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, క్రిస్ గేల్‌ని ఆడించడం కంటే వరుసగా ఫెయిల్ అవుతున్న నికోలస్ పూరన్‌ని ఆడించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దీంతో గేల్, చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...

89
chris Gayle

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో కూడా క్రిస్ గేల్‌కి చోటు ఇవ్వలేదు పంజాబ్ కింగ్స్. ఒకవేళ గేల్‌ని కెఎల్ రాహుల్ కరెక్టుగా వాడి ఉన్నా, పంజాబ్ కింగ్స్ రిటెన్షన్‌లో యూనివర్సల్ బాస్‌కి చోటు దక్కి ఉన్నా అతను ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొని ఉండేవాడని అంటున్నారు అభిమానులు...

99

అయితే కొన్నాళ్ల క్రితం జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసిన క్రిస్ గేల్, ‘ఐపీఎల్ తర్వాతి సీజన్ కోసం సిద్ధమవుతున్నా’ అంటూ కాప్షన్ జోడించడం విశేషం... 

click me!

Recommended Stories