సారీ జడేజా, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు... ధోనీ ఉన్నంతకాలం ఇంతే..

First Published May 7, 2022, 4:41 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌ని రవీంద్ర జడేజా, తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేడేమో. ఎమ్మెస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్ అవ్వాలని ఎంతో ఆశపడి, ఆ అవకాశాన్ని కూడా దక్కించుకున్న రవీంద్ర జడేజా... 10 మ్యాచులు కూడా ముగియకముందే ఆ పొజిషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ఎమ్మెస్ ధోనీ సంచలన ప్రకటన చేయడం, ఆ బాధ్యతలను రవీంద్రజడేజాకి అప్పగిస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి...

ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు చాలా సార్లు... ‘నేనే’ అంటూ సమాధానం ఇచ్చిన జడ్డూ, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బరువుని మోయలేకపోయాడు... 

Latest Videos


సీఎస్‌కే ప్రధాన బౌలర్ దీపక్ చాహార్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడం, గత సీజన్‌లో చెన్నైకి విజయాలు అందించిన ఫాఫ్ డుప్లిసిస్, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు ఇప్పుడు జట్టులో లేకపోవడం, రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో లేకపోవడంతో సీఎస్‌కే వరుసగా ఓటములు ఎదుర్కొంది...

Ravindra Jadeja

8 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకోవడమే కాకుండా కెప్టెన్సీ ప్రెషర్‌తో అటు బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ ఫెయిల్ అవుతూ వచ్చిన జడేజా... ‘నాకొద్దీ కెప్టెన్సీ’ అంటూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..

Jadeja-Dhoni

‘జడేజా, సీఎస్‌కే కెప్టెన్సీ తీసుకోబోతున్నాడని తెలిసినప్పుడే నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఫీల్డ్‌లో ఎమ్మెస్ ధోనీ ఉంటే మిగిలిన ఆటగాళ్లపై అతని ప్రభావం ఓ లెవెల్‌లో ఉంటుంది...

Dhoni-Jadeja

దాన్ని దాటి కెప్టెన్‌గా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. జడ్డూ విషయంలోనూ అదే జరిగింది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం చాలా బాధకరం. అతను చాలా గొప్ప క్రికెటర్... సీఎస్‌కే లాంటి సక్సెస్‌ఫుల్ టీమ్‌ని నడిపించబోతున్నా అనే ఆలోచనే అతన్ని ఇంతటి ఒత్తిడిలోకి నెట్టేసి ఉంటుంది...

అతను ఇలాంటి పొజిషన్‌ని తెచ్చుకోకుండా ఉండి ఉంటే బాగుండేది. ఎందుకంటే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్సీ నుంచి నేను కూడా తప్పుకున్నా...

ప్రెషర్‌ని తట్టుకోలేనప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడానికి కూడా ధైర్యం కావాలి. జడేజా ఆ సాహసం చేసినందుకు మెచ్చుకోవాల్సిందే...

సీఎస్‌కే ఫ్రాంఛైజీ మొత్తం ఎమ్మెస్ ధోనీ చుట్టూ నిర్మించబడింది. అందుకే ఆ జట్టునే వేరే ప్లేయర్ నడిపించడం ఈజీ కాదు. ఎమ్మెస్ ధోనీ జట్టులో ఉన్నంతవరకూ దానికే అతనే కెప్టెన్‌గా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్...

click me!