కేకేఆర్‌లో ఉన్నప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలిచా... ఆ రెండు జట్లకి ఉమేశ్ యాదవ్ కౌంటర్...

Published : Mar 20, 2022, 05:54 PM IST

ఐపీఎల్‌లో సీనియర్ టెస్టు పేసర్లకు పెద్దగా క్రేజ్ ఉండదు. అందుకే భారత టెస్టు బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా తొలి రౌండ్ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే రెండో రౌండ్‌లో లక్కీగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఉమేశ్ యాదవ్‌ను బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది...

PREV
111
కేకేఆర్‌లో ఉన్నప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలిచా... ఆ రెండు జట్లకి ఉమేశ్ యాదవ్ కౌంటర్...

ఐపీఎల్‌ కెరీర్‌లో 121 మ్యాచులు ఆడి 122 పరుగులు చేసి, 119 వికెట్లు పడగొట్టాడు ఉమేశ్ యాదవ్. అయితే ఉమేశ్ యాదవ్‌కి చాలా సీజన్లలో పూర్తి మ్యాచులు ఆడే అవకాశం రాలేదు...

211

2010లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన ఉమేశ్ యాదవ్, మూడేళ్ల పాటు ఆ జట్టుకి ఆడాడు. 2012 సీజన్‌లో 17 మ్యాచులాడి 19 వికెట్లు పడగొట్టాడు...
 

311

2014 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి మారిన ఉమేశ్ యాదవ్, ఆ సీజన్‌లో 12 మ్యాచులు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 2014లో కేకేఆర్ జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది...

411

2017 సీజన్‌లో 14 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్‌ని వేలానికి విడుదల చేసింది కేకేఆర్. 2018 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.4.2 కోట్లకు ఉమేశ్‌ని కొనుగోలు చేసింది...

511

2018 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున 14 మ్యాచులు ఆడి 20 వికెట్లు తీసి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు ఉమేశ్ యాదవ్. అయితే ఆ తర్వాత గాయాల కారణంగా 2019 సీజన్‌లో 11 మ్యాచులాడి 8 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...

611

2020 సీజన్‌లో 2 మ్యాచులాడిన వికెట్ తీయలేకపోయిన ఉమేశ్ యాదవ్‌ని, 2021 సీజన్‌కి ముందు విడుదల చేసింది ఆర్‌సీబీ. 2021 సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.1 కోటి ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లాడు ఉమేశ్...

711

అయితే గత ఏడాది ఉమేశ్ యాదవ్‌ని ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు ఢిల్లీ క్యాపిటల్స్. నోకియా, రబాడా, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్, అశ్విన్ వంటి బౌలర్లు అందుబాటులో ఉండడంలో ఉమేశ్, గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు...

811

ఐపీఎల్ 2022 సీజన్‌లో తిరిగి కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టుకి వచ్చిన ఉమేశ్ యాదవ్, ఈసారి తనకి తుదిజట్టులో అవకాశం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నాడు...

911

‘తిరిగి కేకేఆర్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఫీలింగ్, నాకు ఇక్కడే కలిగింది. ఈసారి కూడా టైటిల్ గెలవడానికి నా వంతు కృషి చేస్తా...’ అంటూ కామెంట్ చేశాడు ఉమేశ్ యాదవ్...

1011

కేకేఆర్‌లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పడం వరకూ సరే కానీ, టైటిల్ గురించి ప్రస్తావించడం బట్టి చూస్తుంటే... ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కౌంటర్ ఇస్తున్నట్టే ఉందని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1111

ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ఫైనల్‌కి వెళ్లిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఈసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనుంది.  

click me!

Recommended Stories