తలుపులు తెరిచిపెట్టండి బాయ్స్, అప్పుడే... ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సలహా...

Published : Mar 20, 2022, 04:47 PM IST

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో చాలా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. కుర్రాళ్లతో నిండిన జట్టు, సీనియర్లు, స్టార్లతో నిండిన జట్లకి చెమటలు పట్టిస్తోంది. దీనికి కారణం హెడ్ కోచ్ రికీ పాంటింగ్... 

PREV
19
తలుపులు తెరిచిపెట్టండి బాయ్స్, అప్పుడే...  ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సలహా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మొట్టమొదటిసారిగా ఫైనల్‌లోకి ప్రవేశించింది ఢిల్లీ క్యాపిటల్స్...

29

ఐపీఎల్ 2021 సీజన్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

39

అయితే గత రెండు సీజన్లలోనూ టైటిల్‌కి దగ్గరిదాకా వచ్చి, రెండు, మూడు స్థానాలకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగనుంది...

49

‘మొదటి మ్యాచ్‌ నుంచి ప్లేయర్లందరి ఫోకస్, గేమ్‌పైకి రావాలి. ఇప్పుడు మా ఫోకస్ అదే. కొత్త టీమ్‌తో ఫస్ట్ సెషన్ బాగా సాగింది. జట్టులో తెలియని ఎనర్జీ కనిపిస్తోంది...

59

నేను బాయ్స్‌కి హోటల్ గది తలుపులు తెరిచిపెట్టి పడుకోమని చెప్పాను. ఎందుకంటే అప్పుడే మిగిలినవాళ్లు ఎప్పుడంటే అప్పుడు రావడానికి, వెళ్లడానికి అవకాశం ఉంటుంది...

69

ఇలా వస్తూపోతూ ఉంటే పరిచయాలు వేగంగా పెరుగుతాయి. ఎదుటి వ్యక్తి గురించి బాగా అర్థమవుతుంది. అలాగే నేను, టీమ్ అందరితో కలిసి బ్రేక్‌ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తాను..

79

కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ప్లేయర్లను నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను. కుర్రాళ్లపై ప్రేమ చూపిస్తే, వాళ్లు కూడా మనమంటే భయం పోయి, ప్రేమగా ఉంటారు. కోచ్ అయినా సీనియర్ ప్లేయర్ అయినా ఇదే నా సూత్రం...
 

89

ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో ఏళ్లుగా ఉంటున్న పృథ్వీషా, అక్షర్ పటేల్, నోకియాలకు వాళ్ల రోల్స్ గురించి పూర్తి క్లారిటీ ఉంది...

99

రిషబ్ పంత్ కెప్టెన్‌గా తన ఎనర్జీని మిగిలిన ప్లేయర్లలో నింపుతూనే ఉంటాను. అతనిలో చురుకుతనమే కాదు, బాధ్యతను గుర్తుచేసే మంచి స్నేహితుడు కూడా ఉన్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్...

Read more Photos on
click me!

Recommended Stories