ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ 10 మ్యాచల్లో ఓడి, పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పరిమితమైంది. రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్లు కూడా ఒక్కటి రెండు మ్యాచుల్లో మినహా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. అయితే ఓ కుర్రాడు మాత్రం ముంబై తరుపున సోలో ఫైటర్‌గా పోరాడాడు... అతనే మన తెలుగు తేజం తిలక్ వర్మ...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టు, రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది... సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కూడా తిలక్ వర్మ కోసం పోటీపడ్డాయి...
25
ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ 36.09 సగటుతో 131.02 స్ట్రైయిక్ రేటుతో 397 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 418 పరుగుల తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ...
35
‘తిలక్ వర్మ బ్యాటింగ్ నాకెంతో నచ్చింది. అతను మేం నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంపులోనే అదరగొట్టాడు. అతను ఓ ప్రామిసింగ్ క్రికెటర్. చాలాసార్లు తిలక్‌తో మాట్లాడాను...
45
తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి స్టడీ చేశాను. అతని మాటల్లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ చాలా క్లియర్‌గా ఉన్నాడు. తిలక్ వర్మ మంచి బౌలర్ కూడా...
55
మేం అతన్ని బౌలింగ్‌లో సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అయితే భవిష్యత్తులో అతని స్పిన్ బౌలింగ్‌ని కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం... తిలక్ వర్మకి మంచి భవిష్యత్తు ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్...