కేన్ మామ, రోహిత్ శర్మ, పోలార్డ్, శార్దూల్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే...

Published : May 31, 2022, 10:55 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ ముగిసింది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా చరిత్ర ఉన్న టీమ్ అన్నీ ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోగా కొత్త జట్టు అంచనాలకు మించి అదరగొట్టాయి. ఈ సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలుస్తుందని భావించిన గుజరాత్ టైటాన్స్, ఏకంగా టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో స్టార్ ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఒకరో ఇద్దరూ కాదు... అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్లతో ఓ టీమ్‌నే తయారుచేసేయొచ్చు..  

PREV
110
కేన్ మామ, రోహిత్ శర్మ, పోలార్డ్, శార్దూల్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే...

రోహిత్ శర్మ... టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రోహిత్, సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 14 మ్యాచుల్లో 268 పరుగులు చేసిన రోహిత్, ఐపీఎల్ కెరీర్‌లో మొదటిసారిగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా సీజన్‌ని ముగించాడు... 

210
venkatesh Iyer

వెంకటేశ్ అయ్యర్... ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్‌ని ఒంటిచేత్తో ఫైనల్‌కి తీసుకెళ్లిన వీరుడు వెంకటేశ్ అయ్యర్. గత సీజన్‌లో రూ.20 లక్షలు తీసుకున్న అయ్యర్‌ని రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కేకేఆర్. అయితే ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడి కేవలం 182 పరుగులు మాత్రమే చేయగలిగాడు వెంకటేశ్ అయ్యర్...

310

కేన్ విలియంసన్...ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి పరిమితం కావడానికి ప్రధాన కారణం కేన్ మామనే. ఈ సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్ 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైయిక్ రేటు 93.51 మాత్రమే. అతి తక్కువ స్ట్రైయిక్ రేటుతో సీజన్‌ని ముగించిన టాపార్డర్ బ్యాటర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు కేన్...

410

అంబటి రాయుడు... గత నాలుగు సీజన్లుగా అదరగొడుతున్న అంబటి రాయుడుని రూ.6.75 కోట్లు పెట్టి తిరిగి కొనుగోలు చేసింది సీఎస్‌కే. అయితే ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 274 పరుగులు మాత్రమే చేయగలిగాడు అంబటి. తన పర్ఫామెన్స్‌పై నిరాశతో రిటైర్మెంట్ ట్వీట్ చేసి, డిలీట్ చేయడం కొసమెరుపు...
 

510

రవీంద్ర జడేజా... ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై టైటిల్ గెలవడానికి ప్రధాన కారణం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఈ సీజన్‌ని సీఎస్‌కే కెప్టెన్‌గా మొదలెట్టిన జడ్డూ, 10 మ్యాచుల్లో 116 పరుగులే చేయగలిగాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు మాత్రమే తీసిన జడేజా, ఫీల్డింగ్‌లో క్యాచులు డ్రాప్ చేసి అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...

610

కిరన్ పోలార్డ్.. ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్‌ని వేలానికి వదిలేసి, ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్‌ని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. అయితే ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో 144 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్, బౌలింగ్‌లోనూ 4 వికెట్లు మాత్రమే తీసి ఆల్‌రౌండ్ ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.

710

శార్దూల్ ఠాకూర్... గత సీజన్‌లో 21 వికెట్లు తీసి, సీఎస్‌కేకి టైటిల్ అందించాడు శార్దూల్ ఠాకూర్. ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌ని రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఈ సీజన్‌లో బౌలింగ్‌లో 15 వికెట్లు తీసిన శార్దూల్, 9.79 ఎకానమీతో బౌలింగ్‌ చేసి గతంలో కంటే ఎక్కువ పరుగులు సమర్పించాడు.

810

ప్యాట్ కమ్మిన్స్... ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ని రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరిసి ఒకే ఓవర్‌లో 35 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించిన ప్యాట్ కమ్మిన్స్, ఈ సీజన్‌లో 5 మ్యాచులు మాత్రమే ఆడి 7 వికెట్లు తీయగలిగాడు. 10.69 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న కమ్మిన్స్‌ని ఎక్కువ మ్యాచుల్లో ఆడించే సాహసం చేయలేదు కేకేఆర్...

910

మహ్మద్ సిరాజ్... ఐపీఎల్ 2021 సీజన్‌లో 6.78 ఎకానమీతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సిరాజ్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది ఆర్‌సీబీ. అయితే ఈ సీజన్‌లో 15 మ్యాచుల్లో 9 వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్, 10.08 ఎకానమీతో పరుగులు ఇవ్వడమే కాకుండా ఏకంగా 31 సిక్సర్లు సమర్పించాడు. 

1010

వరుణ్ చక్రవర్తి... కేకేఆర్ ద్వారా వెలుగులోకి వచ్చి, ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2021 ఆడేశాడు వరుణ్ చక్రవర్తి. గత రెండు సీజన్లలో 35 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిని రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్‌కత్తా. అయితే ఈ సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన వరుణ్ చక్రవర్తి, 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

Read more Photos on
click me!

Recommended Stories